వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా సభ తెలంగాణాలో మార్పుకు సంకేతమా? బండి సంజయ్ వ్యాఖ్యల మతలబు అదేనా?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి నుండే రానున్న ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నీ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చూపించాలని ప్రయత్నిస్తున్న తెలంగాణ బిజెపి నేతలు దీనికోసం అగ్రస్థాయి నేతలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటన నేపద్యంలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణం కాగా, త్వరలో జరగనున్న అమిత్ షా టూర్ రాజకీయంగా మరింత కాక పుట్టిస్తుంది.

అమిత్ షా సభ తెలంగాణలో మార్పుకి సంకేతం: బండి సంజయ్ వ్యాఖ్యలు

అమిత్ షా సభ తెలంగాణలో మార్పుకి సంకేతం: బండి సంజయ్ వ్యాఖ్యలు

ఈనెల 14వ తేదీన మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లో జరగబోయే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ లో పాల్గొనడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ క్రమంలో అమిత్ షా సభ తెలంగాణలో మార్పుకి సంకేతం కాబోతుందని బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఇక బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో అమిత్ షా సభ పై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అమిత్ షా సభ తర్వాత తెలంగాణాలో ఏం మార్పు జరగబోతుంది అన్న ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న అమిత్ షా ఏం ప్రకటనలు చేయబోతున్నారు. టిఆర్ఎస్ సర్కార్ కు చెక్ పెట్టడానికి ఎలాంటి నిర్ణయాలను తీసుకోబోతున్నారు అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలకు ఉత్కంఠ కలిగిస్తుంది.

చంద్రబాబును అణచివేసేందుకు అనుసరించిన విధానమే తెలంగాణాలోనూ ?

చంద్రబాబును అణచివేసేందుకు అనుసరించిన విధానమే తెలంగాణాలోనూ ?

ప్రధానంగా కెసిఆర్ కుటుంబ పాలన పై, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో సాగిన అవినీతిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న బీజేపీ అగ్రనేతలు తెలంగాణ సర్కార్ ను ఇరకాటంలో పెట్టడానికి ఇప్పటికే అనేక విధాలుగా పావులు కదుపుతున్నారు. గతంలో బీజేపీని వ్యతిరేకించిన చంద్రబాబును అణచివేసేందుకు ఎలాంటి విధానాన్ని అనుసరించారో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనూ ముందుకు వెళతారా అన్న అనుమానం అందరిలో వ్యక్తమౌతుంది. తెలంగాణా సీఎం కెసీఆర్ కు చెమటలు పట్టించే వ్యూహంతో ముందుకు వెళ్తుంది.

బీజేపీకి అడ్డు పడుతున్న రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి

బీజేపీకి అడ్డు పడుతున్న రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిజెపి సర్కారును వ్యతిరేకించిన క్రమంలో ఆయా రాష్ట్రాలలోనూ బిజెపి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. కేంద్రం ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ కేంద్రం పరిధిలో ఉన్న అనేక సదరు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకమైన నిర్ణయాలను తీసుకోవడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించి దాడులు చేయించడం వంటి అనేక ఘటనలు బీజేపీ పాలన సాగించని రాష్ట్రాలలో చోటుచేసుకున్నాయి.

అమిత్ షా సభ.. కీలక ప్రకటనలపై ఆసక్తి, అందుకే బండి వ్యాఖ్యలు

అమిత్ షా సభ.. కీలక ప్రకటనలపై ఆసక్తి, అందుకే బండి వ్యాఖ్యలు

ఇక ఏకంగా హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అమిత్ షా టూర్ పైన కూడా టిఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసే అవకాశం లేకపోలేదు. ఒక టిఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కోవడం కోసం అమిత్ షా ఏ విధమైన ప్రకటనలు చేస్తారు. కేంద్ర అధికార బలాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉపయోగిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇక బండి సంజయ్ అమిత్ షా సభ తెలంగాణలో మార్పుకి సంకేతం కాబోతుందని చెప్పడం వెనుక టిఆర్ఎస్ సర్కార్ కు చెక్ పెట్టే కీలక ప్రకటనలు అమిత్ షా చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.

English summary
Bandi Sanjay commented that Amit Shah meeting is a sign of change in Telangana. In this context there will be a discussion on the comments of Bandi Sanjay. Union Home Minister Amit Shah is expected to address key issues in the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X