సండ్ర అరెస్ట్ తప్పదా, ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్ డిఫెన్స్‌లో పడ్డారా, అప్రమత్తం?

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ నేతలు సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావులకు నోటీసులు జారీ చేయనుందనే ప్రచారం జరుగుతోంది. స్టీఫెన్ సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు సీఎం రమేష్ బ్యాంక్ ఖాతా నుండి డ్రా చేయగా, ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలతో గరికపాటి చర్చలు జరిపినట్లుగా భావిస్తున్నారు.

చంద్రబాబును కలిసిన వేం

ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారించిన వేం నరేందర్ రెడ్డి గురువారం ఉదయం చంద్రబాబును కలిశారు. వేంతో పాటు గరికపాటి రామ్మోహన రావు కూడా కలిశారు. మరోవైపు, సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించి ఏసీబీ వద్ద ఆధారాలున్నాయని, ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది.

Is KCR in defence with Phone tapping?

కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారా?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. 120 మంది కీలక వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా పక్కా ఆధారాలున్నాయని ఏపీ మంత్రులు చెబుతున్నారు.

ఇందులో భాగంగా విచారణ కోసం దర్యాఫ్తు సంస్థను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శిని అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని ఏ ఒక్కరి కాల్ డేటాను ఎవరికీ వెల్లడించవద్దని ప్రయివేటు టెలికాం ఆపరేటర్లతో చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తాయని చెబుతున్నారు. ట్యాపింగ్ పైన ఆధారాలు ఉండవద్దని కోరినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, కరీంనగర్ జిల్లాలో బుధవారం రాత్రి ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ అయిన కేసీఆర్.. చంద్రబాబు పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. చంత్బాబు పని అయిపోయినట్లేనని, ఓటుకు నోటు కేసులో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు లేవని చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీకి ఏపీ డీజీపీ, సీఎస్

ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి వివరాలు కేంద్రానికి వెల్లడించేందుకు ఏపీ డీజీపీ, సీఎస్‌లు గురువారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+