రెవెన్యూ శాఖ... సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం...? ఐజీ విచక్షణాధికారాల్లో కోత...?
రెవెన్యూ శాఖకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థ రద్దు,కొత్త రెవెన్యూ చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం... తాజాగా స్టాంపు డ్యూటీ వసూళ్లకు సంబంధించి అధికారుల విచక్షణాధికారాలకు కోత పెట్టాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు 'ఇండియన్ స్టాంపు యాక్ట్-1899'కు సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అసలేంటీ ఈ చట్టం...
యాక్ట్ సవరణను రాష్ట్రపతికి పంపించడానికి ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపించే అవకాశం ఉందన్న లీకులు వస్తున్నాయి. ఇండియన్ స్టాంప్ యాక్ట్-1899లోని సెక్షన్ 47(ఏ) ప్రకారం... భూమి విలువ బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ విలువ (రిజిస్ట్రేషన్ వాల్యూ) ఎక్కువగా ఉంటే... సదరు భూ యజమాని సబ్-రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి విలువను తగ్గించమని,ఆ ప్రకారమే స్టాంప్ డ్యూటీని వసూలు చేయమని కోరవచ్చు. దరఖాస్తును పరిశీలించిన పిదప సబ్ రిజిస్ట్రార్ దాన్ని జిల్లా రిజిస్ట్రార్(డీఆర్)కు పంపిస్తాడు. అక్కడి నుంచి అది రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్(ఐజీ) వద్దకు వెళ్తుంది. ఐజీకి ఉండే విచక్షణాధికారాలతో రిజిస్ట్రేషన్ వాల్యూని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవచ్చు.

డీఆర్‌ల నుంచి ఐజీలకు బదిలీ..
ఐజీ ఆమోదం మేరకు ఆయన నిర్ణయించిన వాల్యూ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ స్టాంప్ డ్యూటీ వసూలు చేసి భూమిని రిజిస్టర్ చేస్తాడు. నిజానికి గతంలో ఈ అధికారం జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలకు ఉండేది. కానీ వారిపై పని ఒత్తిడి అధికమవుతుండటంతో ఆ బాధ్యతలను జిల్లా రిజిస్ట్రార్లకు(డీఆర్) బదిలీ చేశారు. అయితే కొన్ని సందర్భాల్లో డీఆర్‌లు సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కై మార్కెట్ వాల్యూని భారీగా తగ్గించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారన్న విమర్శలున్నాయి. మియాపూర్ భూకుంభకోణంలోనూ ఇదే అంశం బయటపడింది. దీంతో ప్రభుత్వం ఆ అధికారాలను ఐజీలకు దఖలు పరిచింది.
Recommended Video

బిల్లు పెట్టే ఛాన్స్...?
ఐజీలకు అప్పగించిన అధికారాలను కూడా తొలగించాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇండియన్ స్టాంప్ యాక్ట్‌లోని సెక్షన్ 47(ఏ)కు సవరణ చేసిన గవర్నర్‌కు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది కేంద్ర పరిధిలోని చట్టం కావడంతో... ముందు శాసన సభ సమావేశాల్లో బిల్లును పెట్టి ఆమోదించే అవకాశం ఉంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. అయితే ఈ చట్ట సవరణను కేంద్ర హోంశాఖ పరిశీలించి ఆమోదిస్తేనే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారని నిపుణులు చెబుతున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications