'రేవంత్ వేరేవ్యక్తి కాదు, మా అల్లుడే': అలా షాకిచ్చిన కాంగ్రెస్ నేత

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  TRS అంచనాలు రివర్స్: ఎదురులేని రేవంత్

  టీఆర్ఎస్ అంచనాలు రివర్స్: ఎదురులేని రేవంత్, ఇక కాపాడుకోవాలి

  కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరికను చాలామంది స్వాగతిస్తున్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఆయన చేరిక వల్ల తమకు నష్టం జరుగుతుందని భావించేవారు వ్యతిరేకిస్తున్నారు.

  అందుకే టీడీపీని వదిలేశా: మోడీని లాగిన రేవంత్, సోనియాను ఆకాశానికెత్తారు

  చాలామంది స్వాగతిస్తున్నారు కానీ

  చాలామంది స్వాగతిస్తున్నారు కానీ

  రేవంత్ నియోజకవర్గమైన కొడంగల్ నుంచి దాదాపు ఎక్కువ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి చేరికను స్వాగతిస్తున్నారు. రేవంత్‌తో పాటు వచ్చే వారిలో చాలామందికి కాంగ్రెస్ టిక్కెట్లు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గాల వారు మాత్రం తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

  రేవంత్ రెడ్డి బయటి వ్యక్తి కాదు

  రేవంత్ రెడ్డి బయటి వ్యక్తి కాదు

  కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి చేరికను తాము స్వాగతిస్తున్నామని రఘువీరా చెప్పారు. ఆయన తమకు బయటి వ్యక్తి కాదని, మాజీ కేంద్రమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి స్వయానా అల్లుడు అని చెప్పారు.

   రేవంత్ రెడ్డికి జానారెడ్డి ఝలక్

  రేవంత్ రెడ్డికి జానారెడ్డి ఝలక్

  మంగళవారం రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో చేరగానే ఎవరూ బాహుబలి కాదని, పార్టీని గెలిపించిన వారే నిజమైన బాహుబలి అని వ్యాఖ్యానించారు.

  బాహుబలి కామెంట్లు

  బాహుబలి కామెంట్లు

  తమ పార్టీలో ఓ బాహుబలి వస్తారని గతంలో జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జానా చెప్పిన బాహుబలి రేవంత్ అనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో జానా పై వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని కలిగిస్తున్నాయి.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Congress Party leaders thinking that Revanth Reddy is Bahubali for their party for 2019 general elections.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి