• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయ్యిందా లేదా ? కేంద్ర మంత్రి చెప్పింది నిజమేనా ?

|
  కేంద్ర మంత్రి చెప్పింది నిజమేనా ? | Kaleshwaram Project Not Yet Be Completed Says Union Minister

  తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అట్టహాసంగా చేసి జాతికి అంకితం చేశారు . అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో తాజాగా పార్లమెంట్ లో జరిగిన చర్చ అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయ్యిందా కాలేదా అన్న అనుమాలను కలిగిస్తుంది . ఇంతకీ కాళేశ్వరం విషయంలో ఆసక్తికర సీక్రెట్స్ ను బయట పెట్టిన ఆ స్టోరీ ఏంటంటే

  కేసీఆర్ ది పెద్దమనసు .. ఔదార్యం గొప్పది .. కేసీఆర్ కు జగన్ కితాబు

  కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి

  కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి

  తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు కేంద్రమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావటానికి .30వేల కోట్ల భారీ మొత్తం అవసరమని చెప్పి షాకింగ్ విషయం వెల్లడించారు . ఇక ఈ విషయం విన్న వాళ్ళంతా మొన్ననే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం చేసి జాతికి అంకితం చేశారు. ఇంకా పూర్తి కాలేదని కేంద్ర మంత్రి చెప్తారేమిటి అని ఆశ్చర్యంగా అనిపించినా అసలు విషయం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే .

  కాళేశ్వరం పనులు పూర్త కాకుండానే ప్రారంభోత్సవం చేసిన కేసీఆర్

  కాళేశ్వరం పనులు పూర్త కాకుండానే ప్రారంభోత్సవం చేసిన కేసీఆర్

  ఇటీవల సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయినంత హడావుడి చేసి పత్రికల్లో భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వటమే కాదు.. రెండు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను పిలవటం..పూజలు.. పునస్కారాలు చేసి చాలా ఘనంగా ప్రాజెక్ట్ ను ప్రారంభించి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.మొన్నటి కేసీఆర్ హడావుడి చూస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా పూర్తి అయ్యిందన్న భావన అందరికీ కలగటం ఖాయం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన పంప్ హౌస్ ల దగ్గర ప్రాంభోత్సవాల్ని నిర్వహించటం.. దీనికి తోడు కాళేశ్వరం నీళ్లు పారే ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాల్ని చేపట్టటం తెలిసిందే. ఇక అట్టహాసంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించినా కాళేశ్వరం పనులు పూర్తి కాలేదు అన్న విషయం తాజాగా కేంద్ర మంత్రి చెప్పిన లెక్కలతో బయటకు వచ్చింది.

   కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయటానికి మరో రూ.30వేల కోట్ల ఖర్చు అవుతుందని పార్లమెంట్ లో పేర్కొన్న కేంద్ర మంత్రి

  కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయటానికి మరో రూ.30వేల కోట్ల ఖర్చు అవుతుందని పార్లమెంట్ లో పేర్కొన్న కేంద్ర మంత్రి

  కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయటానికి మరో రూ.30వేల కోట్ల ఖర్చు అవుతుందని పేర్కొన్న కేంద్రమంత్రి సభలో పేర్కొన్నారు. కేసీఆర్ మిత్ర పక్ష పార్టీ ఎంపీ , ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావటానికి ఎంత మేర నిధులు ఇంకా అవసరమవుతాయని అడిగిన ప్రశ్నకు సమాధానంగా రూ.30వేల కోట్ల భారీ మొత్తం అవసరమని చెప్పారు కేంద్ర మంత్రి . 2019 జూన్ నాటికి ఈ ప్రాజెక్టు కోసం రూ.50481 కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇంకా రూ.30వేల కోట్లు అవసరం అని తెలిపారు.సగం పూర్తి అయిన ప్రాజెక్టుకే ఇంత హడావుడి కేసీఆర్ ఎందుకు చేశారు అన్న ప్రశ్న కేంద్ర మంత్రి చెప్పిన విషయంతో చాలా మందికి ఉత్పన్నం అవుతుంది. ఇక కాళేశ్వరం విషయంలో కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వలేదని లెక్కలు చెప్పిన కేసీఆర్ మాట నిజమా .. లేకా కేంద్రం చెప్తుంది నిజమా అన్న అనుమానం కూడా కలగకమానదు .

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  "It will cost another Rs 30,000 crore to complete the Kaleshwaram project," the Union Cabinet minister has said. Asked how much funds would be needed to complete the kaleshwaram , KCR Allied Party MP and MIM chief Asaduddin Owaisi , the Union Minister said that a huge sum of Rs. 30 thousamd crores . The project is estimated to cost Rs 50481 crore by June 2019. with the statement of the central minister telangana people shocked why KCR inaugurated kaleshwaram project without the total completion of the project
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more