బాబు-రేవంత్ లోగుట్టు?: స్ట్రాటజీతోనే!.., చేసేది చెప్పొద్దన్న అధినేత..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రత్యర్థి పసిగట్టకుండా.. పక్కనున్న వాళ్లకు కూడా వాసన రాకుండా వ్యూహాలను అమలు చేయడం రాజకీయాల్లో సహజం. ఉనికే ప్రశ్నార్థకమైనప్పుడు సిద్దాంతాల్ని పట్టుకుని వేలాడమెందుకన్న ఆలోచనకూ వస్తారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా ఇలాంటిదే.

పార్టీ మారినా టీడీపీపై ప్రేమ చావదని రేవంత్ చెప్పకనే చెప్పారు. రేవంత్ సహా అనుచరులంతా భావోద్వేగానికి గురైన తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఇదంతా రేవంత్ కేంద్రంగా జరుగుతున్న రాజకీయమేనా? లేక దీని వెనకాల ఇంకేమైనా శక్తులు ఉన్నాయా? అన్న ఆలోచన వచ్చినప్పుడు పలు ఆసక్తికర విషయాలు గమనంలోకి వస్తాయి.

 బాబు వ్యూహమే:

బాబు వ్యూహమే:

చంద్రబాబుకు నమ్మినబంటులా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారడం అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ.. అధినేత ముఖంలో మాత్రం అలాంటి ఫీలింగే లేదు. విదేశీ పర్యటన నుంచి వచ్చాక రేవంత్ పై బాబు స్వయంగా మాట్లాడుతారనుకున్నప్పటికీ.. ఎందుకనో ఆయన మాట్లాడలేదు. అటు రేవంత్ కూడా బాబుపై ఎటువంటి విమర్శలు ఎక్కుపెట్టకపోగా.. ప్రేమ కురిపిస్తూనే హుందాగా తప్పుకున్నారు.

రేవంత్‌కు బిగ్ షాక్, రివర్స్: వెంట వచ్చిన వాళ్లు తిరిగి టీడీపీలోకి

 లోగుట్టు?:

లోగుట్టు?:

రేవంత్ బాబుపై ప్రేమ చాటుకోవడం, పార్టీ మార్పుపై నేరుగా స్పందించకుండా బాబు కూడా రేవంత్ కు అనుకూల వాతావరణం కల్పించడం పలు అనుమానాలను కలిగించకమానదు. నిజానికి రేవంత్ బాబు డైరెక్షన్ లోనే కాంగ్రెస్ లో అడుగుపెట్టారని, శత్రువును ఎదుర్కోవడానికి సిద్దాంతాలను పక్కనపెట్టి పెద్ద పథకమే వేశారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ పై బాబు వైఖరి దానికి బలం చేకూరుస్తోంది.

ఏంటిదంతా?: రేవంత్‌ను నిలదీసిన రమణ, దబాయింపుగా రేవంత్.., వ్యూహాత్మకమా?

చెప్పి చేస్తానా?.. స్ట్రాటజీ:

చెప్పి చేస్తానా?.. స్ట్రాటజీ:

టీడీపీ అధినేత చంద్రబాబు తాజా వ్యాఖ్యలు కూడా ఈ లోగుట్టును బలపరుస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అదే సంకేతాలిస్తున్నట్టున్నాయి. రాజకీయాల్లో ఏమి చేయాలనుకుంటున్నామో.. ఆ విషయాన్ని బయటకు చెప్పకూడదని, చెప్పి చేస్తే అది రాజకీయం ఎలా అవుతుందని సమావేశంలో బాబు వ్యాఖ్యానించారు.

రేవంత్ రాజీనామా ప్రస్తావన వచ్చిన వేళ బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, పైగా స్ట్రాటజీతో ముందుకెళ్లాలని, తాను ఏం చేస్తానో వేచి చూడాలని వ్యాఖ్యానించడం రేవంత్-బాబు మధ్య లోగుట్టు ప్రచారానికి మరింత ఊతమిస్తున్నాయి.

 ఊహించుకోవడమే.. అరచేతిని విప్పకూడదు..

ఊహించుకోవడమే.. అరచేతిని విప్పకూడదు..

ఎన్నికలను ఉద్దేశిస్తూ బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మూసిన అరచేతిని చూపిస్తూ.. అందులో ఏముందో ఊహించుకోవాలే తప్ప, చెయ్యి విప్పి చూడకూడదని చెప్పారట. ఎక్కడ ఏం మాట్లాడాలి? ఎప్పుడు ఎలాంటి వ్యూహం పన్నాలన్న విషయాన్ని తనకు వదిలి వేయాలని చెప్పుకొచ్చారట.

పార్టీకి తాను దశ, దిశ వ్యూహాలను సిద్దం చేస్తానని, రమణ నాయకత్వంలో వాటిని అమలు చేయాలని సూచించారట. ఓవైపు టీటీడీపీ నేతలు రేవంత్‌పై విరుచుకుపడుతుండటం.. మరోవైపు అధినేత మాత్రం రేవంత్‌తో రాజకీయ అస్త్రాన్ని సంధించినట్టు మాట్లాడుతుండటం ఇప్పుడు చాలామందికి అంతుపట్టడం లేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu said that politics need secret strategies depends upon the situations to face opponent

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి