కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT, ED Raids: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు..

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఐటీ, ఈడీ సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తోంది. కరీంనగర్, హైదరాబాద్ లో ఏకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ ఆఫీస్ లో ఈడీ సోదాలు చేస్తోంది. పంజాగుట్టలోని శ్రీధర్ ఆఫీస్ కు ఉదయమే చేరుకున్న ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఐటి, ఈడీ సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తోంది.

గ్రానైట్ వ్యాపారి శ్రీధర్
నాలుగవ అంతస్తులో ఉన్న గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ కార్యాలయంలో అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. అటు కరీంనగర్ లోనూ ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తోన్నారు. కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌ ఇంటితో పాటు మంకమ్మతోటలో ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్‌, కమాన్‌ ప్రాంతంలోని మహవీర్‌, ఎస్వీఆర్‌ గ్రానైట్స్‌లో ఐటీ, ఈడీ తనిఖీలు చేస్తోంది. ఏక‌కాలంలో రెండు చోట్ల 30 ప్రాంతాల్లో సోదాలు జ‌రుగుతోన్నట్లు తెలుస్తోంది.

 IT and ED officials are searching the house of Civil Supplies Minister Gangula Kamalakar

సీబీఐ,ఈడీ
గ్రానైట్‌ వ్యాపారి అరవింద్‌వ్యాస్‌తో పాటు మరికొంతమంది ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతోన్నాయి. గ్రానైట్ రవాణా పన్ను ఎగవేసిన వ్యవహారంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో గతంలోనే 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దాదాపు 20 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు చేస్తున్నారు. కరీంనగర్ గ్రానైట్ అవకతవకలపై గతంలో సీబీఐ,ఈడీ కేసులు నమోదు చేశాయి.

English summary
IT and ED officials are searching the house of Civil Supplies Minister Gangula Kamalakar. Along with the house, IT and ED are conducting inspections at Shweta Granite in Mankammathota, Mahaveer and SVR Granites in Kaman area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X