KTR: చిన్నప్పటి నుంచి పిల్లలకు విలువలు నేర్పించాలి: కేటీఆర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్రంలోమహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని పేర్కొన్నారు.
వీ హబ్ ప్రతినిధులకు కేటీఆర్ అభినందించారు. రూ. 1.30 కోట్లు ఇస్తే వీ హబ్ నుంచి ఒక స్టార్టప్‌తో రూ. 70 కోట్లకు పెంచారని గుర్తు చేశారు. స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు కూడా అందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నామన్నారు. ప్రతీ మూడు కోవిడ్ టీకాల్లో రెండు హైదరాబాద్ నుంచే వచ్చాయని కేటీఆర్ చెప్పారు.

పిల్లలకు చిన్నప్పటి నుంచి విలువలు నేర్పించాలని కేటీఆర్ సూచించారు. పిల్లల్ని ఎలా పెంచుతామనేది ముఖ్యమైన కేటీఆర్ అన్నారు. మానవ వనరులు, సాంకేతికతను వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యం అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం 'జర్నలిజంలో మహిళలను గౌరవించడం' కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్‌మెంట్ నిర్వహించింది. జర్నలిజంలో కొత్త ప్రాంతాలను అన్వేషించాలనుకునే మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'ఉమెన్ ఇన్ జర్నలిజం లీడర్‌షిప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ 2023' ను ప్రారంభిస్తోందని కేటీఆర్ చెప్పారు.












Click it and Unblock the Notifications