వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ గ్రిడ్ యజమాని అశోక్ దొరికితేనే కీలక సమాచారం.. అశోక్ ని కాపాడుతుంది ఏపీ సర్కారేనా ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

IT Grid Owner Ashok Was Protected By The AP Government ? | Oneindia Telugu

ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాబేస్ చోరీకి గురైందని లోకేశ్వర్ రెడ్డి అనే ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటి గ్రిడ్లో సైబరాబాద్ పోలీసులు విస్తృతమైన తనిఖీలు చేసి, కీలకమైన సమాచారం తో కూడి ఉన్న హార్డ్ డిస్క్ లను సీజ్ చేశారు. దీంతో ఈ సంస్థలు నిర్వహిస్తున్న అశోక్ పరారీలో ఉన్నారు. అశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను జల్లెడ పడుతున్నారు. అశోక్ ఆచూకి దొరికితే కానీ అసలు ఈ కేసు విషయంలో సమగ్ర సమాచారం లభించే అవకాశం లేదు.

ఏపీ తెలంగాణాల మధ్య ముదురుతున్న పొలిటికల్ వార్... దేనికోసం ? ఏపీ తెలంగాణాల మధ్య ముదురుతున్న పొలిటికల్ వార్... దేనికోసం ?

ఇప్పటికే అశోక్ కు నోటీసులు జారీ చేసిన పోలీసులు లొంగిపోవాలని కోరారు. లేకపోతే అరెస్టు తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

 IT grid owner Ashok had key information .. Is AP govt protects Ashok ?

ఐటీ గ్రిడ్ యజమాని అశోక్ దొరికితే తప్ప పూర్తి సమాచారం రాబట్టలేమని అంటున్నారు పోలీసులు . ఈ కేసు విషయమై ముందుగానే అశోక్‌ కు లీకైనట్టుగా తెలుస్తోంది. ఈ సమాచారం లీక్ కావడంతో ఆశోక్ మూడు కీలకమైన హార్డ్ డిస్క్‌లను తీసుకొని పారిపోయినట్టుగా చెబుతున్నారు.అశోక్ ఏపీ పోలీసుల ఆధీనంలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు.అశోక్ దొరికితేనే ఈ కేసులో చిక్కుముడులు వీడే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

మరి అశోక్ దొరుకుతాడా? అశోక్ ను దొరకకుండా కాపాడుతుంది ఏపీ లోని అధికార పార్టీ నా? అన్న అనుమానాలు సైతం కలుగుతున్నాయి. ఏది ఏమైనా ఏపీ కి సంబంధించిన వ్యవహారమని వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు అంతు చూసే పనిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా ఐటీ గ్రిడ్ వ్యవహారంలో చంద్రబాబుకు చుక్కలు చూపించాలని ఫిక్స్ అయింది తెలంగాణప్రభుత్వం. అశోక్ దొరికితే మాత్రం ఏపీ సర్కార్ బండారం బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏపీ సర్కార్ అశోక్ దొరకకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

English summary
The IT grid controversy over the misuse of the AP public data came to light. The IT grid owner escaped after registering the case. Police are searching him to catch . Already the notices issued by police to Ashok. police are expected that Ashok was protected by the AP government. The key information is available in this case if the police finds Ashok .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X