కేసీఆర్ సర్కార్‌పై బీజేపీ ఎంపీ సంచలనం: కుటుంబ పాలన అంతానికి ఇది ఆరంభం మాత్రమే: దుబ్బాక రిపీట్

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జోరు కొనసాగుతోంది. ప్రారంభ ఫలితాల్లో కనపరిచిన దూకుడును ఆ తరువాత కూడా కొనసాగిస్తోంది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ బీజేపీ ఆధిక్యత మరింత పెరగడం కనిపించింది. కమలానికి ధీటుగా తెలంగాణ రాష్ట్ర సమతి గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. రెండో స్థానానికే పరిమితం అయ్యేలా ఉంది. బీజేపీ-టీఆర్ఎస్ మధ్య సీట్ల ఆంతరం 30 నుంచి 40 స్థానాల వరకు ఉండటం వల్ల కమలం వేగాన్ని కారు అందుకోలేకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి.

బీజేపీ నేతల్లో గెలుపు ఉత్సాహం నెలకొంటోంది. దుబ్బాక ఉప ఎన్నిక తరహా ఫలితాలే జీహెచ్ఎంసీలోనూ వెలువడుతాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన అంతం కావడానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీజం వేస్తాయని బీజేపీ సీనియర్ నేత, నిజామాబాద్ లోక్‌సభ సభ్యుడు ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. తొలుత- లోక్‌సభ ఎన్నికలు, అనంతరం దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీచిందని ఆయన చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ సగం స్థానాలను కోల్పోయిందని గుర్తు చేశారు.

 it is clear message to TRS that people want change, says Telangana BJP MP D Arvind

దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా తన సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయిందని చెప్పారు. సానుభూతి పవనాలను సైతం ప్రభుత్వ వ్యతిరేకత అధిమిందని అరవింద్ వివరించారు. అదే తరహా ఫలితం గ్రేటర్ హైదరాబాద్‌లో వెలువడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నిలబెట్టుకోలేకపోయిందని, అధిక ఆదాయాన్ని అందించే గ్రేటర్ హైదరాబాద్‌ను కేసీఆర్ ప్రభుత్వం నాశనం చేసిందని విమర్శించారు. హైదరాబాద్ ఎలాంటి దుర్గతిలో ఉందో తెలియజేయడానికి మొన్నటి వరదలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాయని అరవింద్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+