• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నీ కేసీఆర్ కు అనుకూలంగా జరుగుతాయనుకోవడం మూర్ఖత్వం.! సీఎం తనను అవమానించారన్న ఈటల.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమైఖ్య రాష్ట్రంలో ఉన్న స్వేఛ్చ ఇప్పుడు తెలంగాణలో లేదని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ చట్టసభల్లో తనను అవమానించారని మండిపడ్డారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించడానికి వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసారని ఆరోపించారు. నిజమైన ఉద్యమకారులను కాదని, ఉద్యమాన్ని హేళన చేసిన వారితో తనపై నిందలు వేయించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రశేఖర్ రావు పై ఘాటు వ్యాఖ్యలు చేసారు ఈటల రాజేందర్. తెలంగాణలో చంద్రశేఖర్ రావు చెప్పిందే ప్రజాస్వామ్యం అన్నట్టు పరిస్ధితులు తయారుచేసారదని ఈటల తెలిపారు.

హుజురాబాద్ ఫలితం అంతం కాదు ఆరంభం మాత్రమే.. కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ మొదలైందన్న ఈటల

హుజురాబాద్ ఫలితం అంతం కాదు ఆరంభం మాత్రమే.. కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ మొదలైందన్న ఈటల

హుజురాబాద్ ఫలితం అంతం కాదు ఆరంభం మాత్రమే.. కేసీఆర్ కు బ్యాడ్ టైమ్ మొదలైందన్న ఈటల
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోయినందుకు సీఎం చంద్రశేఖర్ రావు కు మతి భ్రమించిందని, అందుకే మీడయా సమావేశాల్లో గంటలకొద్ది పసలేని ప్రసంగాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి వైఖరి గమనిస్తున్న ప్రజలు నవ్వుకుంటున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తనను ఓడించేందుకు 600వందల కోట్ల అక్రమ సంపాదనను ఖర్చు చేసారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ అనే వాడి మోఖం అసెంబ్లీలో చూడొద్దని హుకూం జారీ చేసి నియంతలాగా వ్యవహరించారని చంద్రశేఖర్ రావుపై ఈటల ధ్వజమెత్తారు. తనను ఓడించేదుకు ప్రగతి భవన్ లో ఆరునెలలుగా వ్యూహం రచిందడమే కాకుండా సుమారు పది మంది మంత్రులను రంగంలోకి దించారని ఈటల గుర్తు చేసారు.

ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్న కేసీఆర్.. తెలంగాణ ద్రోహులతో తిట్టించే ప్రయత్నమన్న రాజేందర్..

ఉద్యమ ద్రోహులను అక్కున చేర్చుకున్న కేసీఆర్.. తెలంగాణ ద్రోహులతో తిట్టించే ప్రయత్నమన్న రాజేందర్..


ఇంత చేసినప్పటికి హుజురాబాద్ ప్రజలు చంద్రశేఖర్ రావు గూబ గుయ్యుమనిపించారని, ఒక్క హుజురాబాద్ లో ఓడిపోతేనే ఇంత అభద్రతా భావానికి లోనైతే రేపు సాదారణ ఎన్నికల్లో ఓటమిపాలైతే ఏంటి పరిస్థితని ఈటల ప్రశ్నించారు. మండి పడ్డారు. సీఎం చంద్రశేఖర్ రావు మీడియా ముందు గంటలసేపు మాట్లాడుతూ తానూ ఏ తప్పూ చేయలేదని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ప్రజలు అన్నీ అంశాలు గమనిస్తున్నారని ఈటల తెలిపిరు. సీఎం చంద్రశేఖర్ రావు చేస్తున్న ప్రతి వ్యాఖ్యల పట్ల తెలంగాణ సమాజం నవ్వకుంటోందని, తెలంగాణలో చంద్రశేఖర్ రావు మాట చెల్లే రోజులు పోయాయని ఈటల పేర్కొన్నారు.

తెలంగాణలో స్వేఛ్చ లేదు.. కేసీఆర్ కబంధ హస్తాలనుండి తెలంగాణను కాపాడుకోవాలన్న ఈటల

తెలంగాణలో స్వేఛ్చ లేదు.. కేసీఆర్ కబంధ హస్తాలనుండి తెలంగాణను కాపాడుకోవాలన్న ఈటల

అంతే కాకుండా తెలంగాణ ఉద్యమంలో నిఖార్సయిన పోరాటం చేసిన తన లాంటి వారి మీద తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకుని వారితో అనరాని మాటలు అనిపిస్తున్నారని, నిజమైన తెలంగాణ వాదుల జీవితాల్లో చికట్లు నింపి ద్రోహులకు పెద్దపీఠ వేస్తున్న అంశాన్ని యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేసారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరిడిన నిజమైన ఉద్యమకారులు ఎవ్వరూ కూడా చంద్రశేఖర్ రావు వెంట ఉండకూడదని, అందరూ చంద్రశేఖర్ రావు కబంధ హస్తాలనుండి విముక్తిచేసుకుని బయటకు రావాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. హురారాబాద్ ప్రజా తీర్పు ఆరంభం మాత్రమేనని, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ఫలితం పేనరావృతం అవుతుందని ఈటల పేర్కొన్నారు.

 ప్రజల గొంతుకనవుతా.. సమస్యలు పరిష్కరిస్తానన్న రాజేందర్

ప్రజల గొంతుకనవుతా.. సమస్యలు పరిష్కరిస్తానన్న రాజేందర్

తెలంగాణ సమాజం ఇకనైనా చంద్రశేఖర్ రావు మోసపూరిత విధానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈటల సూచించారు. చంద్రశేఖర్ రావు అసలు రంగు, రూపం తేటతెల్లం అయిన తర్వాత మేధావులు, రాజకీయ నేతలు, పాత్రికేయులు చంద్రశేఖర్ రావు వైఖరిని ఎండగట్టేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజా సమస్యలపై పోరాటం ఉదృతం చేయడమే లక్ష్యంగా ప్రజా క్షేత్రంలో అడుగువేస్తానని ఈటల రాజేందర్ స్పష్టం చేసారు. ప్రజల గొంతుగా మారి ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. ముఖ్యంగా హుజురాబాద్ ప్రజానికానికి ఈటల కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Etala Rajender made sensational remarks that the freedom is no longer in Telangana. He was incensed that he had been insulted in the legislature for committing an abuse of power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X