Heavy Rain: హైదరాబాద్‍లో వర్షం.. పలు చోట్ల ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్ లోని పలు వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజరాహిల్స్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, ప్రగతినగర్, నిజాంపేట, సుచిత్ర, కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, బేగంపేట, ఖైరతాబాద్ వర్షం కురుస్తోంది. ఎర్రగడ్డ, అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేటలో కూడా వాన పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగానే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
మంగళవారం తెల్లవారుజామున నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. వర్షంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు.

తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, యెల్లో అలర్ట్ లు జారీ చేసింది. సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి భుననగిరి, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాలకు మాత్రం యెల్లో అలర్ట్ జారీ చేశారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఇటు భూపాలపల్లి, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, కరీంనగర్, జగిత్యాల జిల్లా వర్షాలు కురుస్తున్నాయి. ఇక జగిత్యాల జిల్లాలో కురుస్తోన్న వర్షానికి ధాన్యం అంతా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.












Click it and Unblock the Notifications