IT Jobs: ఇంటర్ అవ్వగానే ఐటీ ఉద్యోగాలు.. ఏటా 20 వేల మందికి అవకాశం..
సాధారణంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలంటే ఏదైనా డిగ్రీ ఉండాలి. అయితే ఇంటర్ తో కూడా ఐటీ ఉద్యోగాలు రానున్నాయి. అయితే ఈ అవకాశం ప్రభుత్వ కళాశాలల్లో చదుకున్నవారికి మాత్రమే. ప్రభుత్వ కాలేజిల్లో ఇంటర్ అయిపోయిన విద్యార్థులకు ఐటీ కొలువులు ఇచ్చేందుకు హెచ్‌సీఎల్ సంస్థ ముందుకొచ్చినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ప్రతి సంవత్సరం 20 వేల మంది ఇంటర్ విద్యార్థులను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగాల్లోకి తీసుకుంటుందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, హెచ్‌సీఎల్‌మధ్య అవగాహన ఒప్పందం జరిగిందని వివరించారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై గురువారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు ఇన్‌ఛార్జి కార్యదర్శి నవీన్‌మిత్తల్‌తో సబితా సమావేశమయ్యారు.

అయితే.. ఈ ఆన్‌లైన్ పరీక్షలో కనీసం 60 శాతం మార్కులు సాధించిన స్టూడెంట్స్‌కు వర్చువల్ పద్ధతిలోనే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. ఇంటర్య్వూల్లో మెరుగైన ప్రదర్శన చేసినవారిని సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు తీసుకోనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇంటర్న్‌షిప్ పూర్తైన తర్వాత సంవత్సరానికి రెండున్నర లక్షల ప్యాకేజీ ఇవ్వనున్నారు.

ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆఫీస్‌లో ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో నెలనెలా 10 వేల స్టైఫండ్ ఇస్తారు. అలాగే ఉద్యోగం చేస్తూనే డిగ్రీ చదువుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తారు. బిట్స్ పిలాని, శాస్త్ర, అమిటీ విశ్వవిద్యాలయాల్లో బీటెక్, బీబీఏ, బీసీఏ, బీఎస్‌సీ లాంటి మూడు, నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చేసుకునే అవకాశం కల్పిస్తారట.












Click it and Unblock the Notifications