హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు అతిగా: ‘మీట్‌ ద ప్రెస్‌’లో కేటీఆర్‌ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంక్షేమం, అభివృద్ధి అంశాలను తీసుకుని ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని కేటీఆర్ చెప్పారు. తన మూడు వారాల అమెరికా పర్యటన వల్ల రాష్ట్రానికి రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్నారు. జూన్ 3 నుంచి 6 వరకూ తైవాన్‌లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అనేది ఒక పార్టీ పోయి మరో పార్టీ అధికారం చేపట్టిన రీతిలో జరిగే మామూలు వ్యవహారం కాదని కేటీఆర్ చెప్పారు.

సరిగ్గా ఏడాది క్రితం అసాధారణ రాజకీయ పరిస్ధితుల మధ్య రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని, ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలిపోతాయనే అపోహలు సృష్టించారని... అలాంటి అనుమానాలను పటాపంచలు చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచామని కేటీఆర్ అన్నారు.

గత ఏడాది కాలంలో ఏ ఒక్క ఐటీ కంపెనీ తరలిపోకపోగా గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు నగరానికి తరలివచ్చాయని గుర్తు చేశారు. అలాగే నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదని చెప్పారు. ప్రెస్‌క్లబ్ గురువారం ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలేంటో చూద్దాం.

‘మీట్‌ ద ప్రెస్‌'లో మంత్రి కేటీఆర్‌

‘మీట్‌ ద ప్రెస్‌'లో మంత్రి కేటీఆర్‌

రెండు వారాల పాటు సాగిన తన అమెరికా పర్యటన లక్ష్యాలు సాధించిందని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీల అధినేతలు మూడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారని తెలిపారు. గూగుల్, అమెజాన్‌లు తమ అతిపెద్ద ఆఫీసుల విస్తరణకు తెలంగాణను ఎంచుకున్నాయని, డీఈషా, బ్లాక్‌స్టోన్ 1300 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యరని అన్నారు. ఇవాళ అమెరికాలోని అనేక ప్రముఖ కంపెనీల ప్రముఖులు హైదరాబాద్‌తో ఏదో రకంగా సంబంధం ఉన్నవారే కావడం గర్వకారణమని అన్నారు.

 ‘మీట్‌ ద ప్రెస్‌'లో మంత్రి కేటీఆర్‌

‘మీట్‌ ద ప్రెస్‌'లో మంత్రి కేటీఆర్‌

పాఠ్యపుస్తకాల్లో సోనియాగాంధీ ప్రస్తావన విషయమై మాట్లాడుతూ ‘‘ఆమె పేరును చరిత్రలో పొందుపరచాలంటే ముందుగా ఆమె, ఆమె పార్టీ తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహం గురించి చర్చించాలి. మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో 360 మంది, మలి దశలో 1000 మంది మృతి చెందడానికి కాంగ్రెస్‌ పార్టీ, సోనియా గాంధీ కారణం కాదా? దీనిని కాంగ్రెస్‌ నేతలు అంగీకరిస్తే ఆమె పేరును చేర్చడానికి మాకు అభ్యంతరం లేదు'' అని స్పష్టం చేశారు.

 ‘మీట్‌ ద ప్రెస్‌'లో మంత్రి కేటీఆర్‌

‘మీట్‌ ద ప్రెస్‌'లో మంత్రి కేటీఆర్‌

రైతు ఆత్మహత్యలను రాత్రికి రాత్రి నివారించడం సాధ్యం కాదని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో చేరడం ఇప్పుడు కొత్త కాదని, గతంలోనూ జరిగిందని, ఇప్పుడు జరుగుతోందని, భవిష్యత్తులోనూ జరుగుతుందని చెప్పారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగానే టీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారన్నారు. అందులో ఎలాంటి తప్పు లేదన్నారు.

‘మీట్‌ ద ప్రెస్‌'లో మంత్రి కేటీఆర్‌

‘మీట్‌ ద ప్రెస్‌'లో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానన్న చంద్రబాబు వ్యాఖ్యలను కేటీఆర్‌ కొట్టిపారేశారు. ఆయన (బాబు) అతిగా ఊహించుకుంటున్నారని, ఒక వ్యక్తి వల్ల ఏదీ జరగదని చెప్పారు. ‘‘ఆయన కొంత ప్రయత్నం చేసి ఉండవచ్చు. కానీ, ఆయన పుట్టకముందే హైదరాబాద్‌ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉందన్నారు.

English summary
IT Minister KTR held a Press Meet on Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X