హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హెటిరోలో భారీగా నగదు గుర్తింపు : పక్కా ఆధారాల సేకరణ : కరోనా వేళ రెమిడెసివిర్‌ తో..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో సంస్థ పైన మూడు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థకు చెందిన కార్యాలయాలతో పాటుగా సంస్థ సీఈఓ తో పాటుగా డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. సంస్థ ఉప్పత్తులు తయారు చేసే ప్లాంట్లలోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సోదాల్లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయాల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియాలో కధనాలు వస్తున్నాయి.

హైదరాబాద్ కేంద్రం ఒక ఫార్మా సంస్థలో ఇంత పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవటం గతంలో ఎన్నడూ లేదనే ప్రచారం సాగుతోంది. అయితే, ఈ సోదాల్లో ఏం సేకరించారు.. దాడుల్లో గుర్తించినవి ఏంటనేది ఇంకా అధికారికంగా బయటకు రాలేదు. దీని పైన ఆదాయపు పన్నను శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సంస్థకు చెందిన డైరెక్టర్ల కార్యాలయాలు..నివాసాల్లో సేకరించిన డాక్యుమెంట్ల కు సంబంధించి పూర్తి స్థాయిలో అసెస్ మెంట్ చేయాల్సి ఉందని చెబుతున్నారు.

IT officials conducted raids on offices and houses of Hetero Ceo and directors pertaining to the tax evasion.

మొత్తం తెలంగాణ, ఏపీ సహా.. ముంబై తదితర ప్రాంతాల్లో మొత్తం 30 చోట్ల దాడులు కొనసాగుతున్నాయని..అన్ని సోదాల్లో కలిపి ఈ మొత్తం స్వాధీనం చేసకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, హెటిరో ఆర్దిక కార్యకలాపాల పైన ఆదాయపు పన్ను శాఖ కరోనా సమయం నుంచి నిఘా పెట్టారని ప్రచారం జరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో రెమిడెసివిర్ ఇంజక్షన్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సంస్థే ఈ ఇంజెక్షన్ ను ఉత్పత్తి చేసింది. దీనికి కొనసాగింపుగా కొవిడ్‌ సోకి ఆస్పత్రుల్లో బెడ్‌పై ఉండే సీరియస్‌ రోగులపై స్టెరాయిడ్స్‌ పనిచేయని పరిస్థితుల్లో టోసిలిజుమాబ్‌ సంజీవనిలా పని చేసిందనే పేరు ఉన్న టోసిలిజుమాబ్‌ను సైతం హెటిరో నుంచే ఉత్పత్తి అయింది.

అయితే, అత్యంత పక్క ప్రణాళికతో ఈ దాడులు జరిగినట్లుగా తెలుస్తోంది. హెటిరోపై రైడ్స్‌ ప్రారంభించేదాకా ఈ సోదాల్లో పాల్గొన్న చాలా మంది ఐటీ సిబ్బందికి విషయం తెలియదని సమాచారం. 300 మంది ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది చేరాక.. 40 ఎస్‌యూవీల్లో ఎక్కడి వారు అక్కడికి వెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే.. సనత్‌నగర్‌లోని హెటిరో ప్రధాన కార్యాలయం, చౌటుప్పల్‌, గుండ్లపోచంపల్లి, విశాఖలోని నక్కపల్లి, ముంబై తదితర ప్రాంతాల్లోని హెటిరో ప్లాంట్లు, ప్రాంతీయ కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి.

ఈ దాడులు హైదరాబాద్‌లోని ఆయ్‌కార్‌ భవన్‌, విశాఖలోని ప్రాంతీయ కార్యాలయంలో సీఐయూ, పలువురు జోనల్‌ ఇన్‌స్పెక్టర్లకు ఉన్నతాధికారుల సూచనల మేరకు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అయితే, పట్టుబడిన నగదు గురించి సంస్థలోని ముఖ్యులను విచారించి..ఆ తరువాత ఆదాయపు పన్ను శాఖ అధికారికంగా వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

English summary
IT official conducted raids on offices and houses of Hetero Ceo and directors since three days. As per sources IT seized huge amount in these raids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X