ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు
ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కంపెనీపై ఆదాయపన్ను శాఖ మంగళవారం దాడి నిర్వహించింది. హైదరాబాద్, ఖమ్మంలోని ఆయన ఇళ్లు, కార్యాలయాలతో పాటు జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంలోను ఆదాయపన్ను అధికారులు తనిఖీలు చెపట్టారు.
శ్రీనివాస్ రెడ్డికి చెందిన నిర్మాణ కంపెనీలు, ప్రాజెక్టుల్లో సోదాలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెలంగాణలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరాసలో చేరారు.

హైదరాబాద్‌లో ఆరుచోట్ల, ఖమ్మంలో పన్నెండు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్ సమీపంలోని పొంగులేటి నివాసంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సోదాలు ప్రారంభించారు. ఎంపీ ఇంటిలోకి ఎవరూ ప్రవేశించకుండా రెండు గేట్లను మూసివేశారు.
హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు కూడా తనిఖీలు కొనసాగే అవకాశముంది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications