ఇంటర్ విద్యార్దులందరూ పాస్..!! నిర్ణయం దిశగా ప్రభుత్వం : ఫెయిల్ వెనుక కారణం..!!

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఫలితాలు...విద్యార్ధుల ఆందోళన...విద్యార్ది సంఘాల బంద్ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. విద్యార్దులతో పాటుగా వారి తల్లిదండ్రులు సైతం ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల పైన ఆందోళనతో ఉన్నారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం రీక్ష రాసిన విద్యార్థులందరినీ పాస్‌ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. తాజాగా బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో దాదాపు 51 శాతం మంది విద్యార్ధులు ఫెయిల్ అయ్యారు. దీనిపైన కలకలం మోదలైంది. విద్యార్దులు ఆందోళనకు దిగారు.

ప్రభుత్వం ముందు కొత్త ప్రతిపానదలు

ప్రభుత్వం ముందు కొత్త ప్రతిపానదలు

ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ 35 శాతం కనీస మార్కులు వేసి, పాస్‌ చేసే విషయాన్ని పరిశీలిస్తోంది. మొత్తం 4,59,242 మంది విద్యార్థులు రాయగా, వీరిలో 2,24,012 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2,35,230 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. పాసైన వారిలో 25 శాతం మంది విద్యార్థులు.. 75 శాతానికి పైగా మార్కులు సాధించారు. కనీస మార్కులు 35-50 శాతం మధ్య సాధించిన విద్యార్థులు 3 శాతం మంది మాత్రమే ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ఫెయిల్‌ అయిన విద్యార్థుల్లో ఎక్కువ మందికి 5-10 శాతం మార్కులు మాత్రమే వచ్చాయి.

51 శాతం విద్యార్దులు ఫెయిల్ కావటంతో

51 శాతం విద్యార్దులు ఫెయిల్ కావటంతో

టాప్ ర్యాంక్ విద్యార్థులు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ పలువురు విద్యార్థులు ఫెయిల్‌ అయ్యామనే మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థి సంఘాలు ఇంటర్‌ బోర్డు, విద్యాశాఖ తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.

గత సంవత్సరం లాక్‌డౌన్‌, ఆన్లైన్‌ క్లాసులతో విద్యాబోధన సరిగ్గా జరగని కారణంగా విద్యార్థులకు సిలబస్‌లో విద్యా శాఖ కూడా మార్పులు చేసింది. అయినప్పటికీ విద్యార్థులు 51 శాతం ఫెయిల్‌ అవడంతో కనీస మార్కులు 35 శాతం వేసి ఫెయిలైన విద్యార్థులను పాస్‌ చేసే ఆంశాన్ని విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అందరినీ పాస్ చేసే దిశగా ఆలోచనలు

అందరినీ పాస్ చేసే దిశగా ఆలోచనలు


ఇదిలా ఉంటే.. ఇంటర్‌ ఫలితాలపై నేడు విద్యార్థి సంఘాలు కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చాయి. 10వ తరగతిలో పరీక్ష రద్దు చేసి అందరినీ పాస్‌ చేయడమేనని అంచనా వేస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం ఫెయిల్‌ అయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్‌ చేయడం తప్ప.. మరో మార్గం కనిపించటం లేదనే వాదన ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం దీని పైన తీసుకొనే తుది నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొని ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+