ఐటీగ్రిడ్ కేసులో ఏపీ సీఈసీ హైకోర్టు నోటీసులు : రిజిస్ట్రార్, ఆధార్ కంపెనీకి కూడా ..

హైదరాబాద్ : ఐటీగ్రిడ్ కేసులో ఏపీ ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ రిజిస్ట్రార్, ఆధార్ కంపెనీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపిన ఈ కేసు విచారణ .. బుధవారం హైకోర్టులో జరిగింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఐటీగ్రిడ్ సీఈవో అశోక్ ఇదివరకే హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసుల పరిధి దాటి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.

రాజకీయం కాదు .. కదా ?
అయితే ఫిర్యాదు చేసిన సదరు వ్యక్తి మాత్రం ఈ పరిణామం రాజకీయంగా జరిగింది కాదని పేర్కొన్నారు. ఎన్నికలు, ఆధార్ డేటా చోరీకి గురైందని తెలిపారు. దీనికి సంబంధించిన కార్యాలయంలో హైదరాబాద్ లో ఉన్నందున తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

itgrid case : telangana high court notice to ap cec, central cec

అలా ఎలా ?
ఎన్నికల కమిషన్ సంబంధించిన డాటా పోయిందా, లేదా ఆధార్ కు సంబంధించిన డాటా దుర్వినియోగం అయిందా అనేది ఆ సంస్థలు చెబితే తెలుస్తుంది తప్ప వేరే వారు ఎలా చెబుతారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోత్రా అశోక్ తరఫున వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు ఏపీ సీఈసీ తదితర సంస్థలకు నోటీసులు జారీచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+