ITR filings:తప్పుడు డాక్యుమెంట్లతో రీఫండ్ పొందితే శిక్ష మామూలుగా ఉండదు..!
హైదరాబాద్: ఇన్‌కమ్‌టాక్స్ రిటర్న్స్‌పై ఆదాయపు పన్నుశాఖ గట్టి నిఘా ఏర్పాటు చేసింది. ఐటీరిటర్న్స్ దాఖలు చేసేప్పుడు క్లెయిమ్ కోసం తప్పుడు సమాచారం పొందుపర్చినా, అర్హతలేని మినహాయింపులు కోసం తప్పుడు డాక్యుమెంట్లు సబ్మిట్ చేసిన వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐటీశాఖ ఏపీ తెలంగాణ రీజియన్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ మిథాలి మధుస్మిత హెచ్చరించారు.
ఇలా చేసిన టాక్స్‌పేయర్స్‌కు శిక్షపడుతుందని మధుమిత తెలిపారు. తప్పుడు క్లెయిమ్స్ చేసిన వారు 12శాతం వడ్డీతో పాటు 200శాతం వరకు ఫైన్ వసూలు చేయడం, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే ఛాన్స్ ఉందని స్పష్టం చేశారు. రెండే తెలుగు రాష్ట్రాల్లో ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు తప్పుడు డాక్యుమెంట్స్ పొందుపర్చి రీఫండ్ పొందినట్లు ఐటీశాఖ గుర్తించింది.

ఈ సందర్భంగా మాట్లాడిన మధుస్మిత తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యోగులు అత్యధికంగా తప్పుడు క్లెయిమ్‌లతో రీఫండ్ పొందారని తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 37శాతం రీఫండ్ ఉంటే.. అది 2022-23కు 84శాతంకు చేరిందని చెప్పుకొచ్చారు. ఇక ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు పొందుపర్చి రీఫండ్ పొందారో వారిని గుర్తించినట్లు మిథాలి మధుస్మిత తెలిపారు. ఇక తప్పుగా ఐటీఆర్ ఫైల్ చేసిన టాక్స్ కన్సల్టెంట్లను గుర్తించే పనిలో ఉన్నట్లు మధుస్మిత వివరించారు. ఐటీ రిటర్న్స్ తప్పుగా సమర్పించి రీఫండ్ పొందిన వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని వెల్లడించారు.
It has been found that a large number of salaried taxpayers of AP & TS have claimed deductions/exemptions which are not correct.
— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) July 7, 2023
They have claimed refunds based on those deductions/ exemptions.
-Pr Chief Commissioner, @IncomeTax_APTS#IncomeTax pic.twitter.com/Iff2KELmmN
ఇదిలా ఉంటే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరితేదీ జూలై 31,2023. ఇది నాన్ ఆడిట్ కేసులకు వర్తిస్తుంది. ఇక ఆడిట్ కేసులకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ 31 అక్టోబర్ 2023. ఇక డెడ్‌లైన్ దాటిన తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే అపరాధ రుసుం రూ.5వేల చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ఆదాయం ఏడాదికి రూ.5 లక్షలలోపు ఉంటే ఈ అపరాద రుసుం రూ. 1000గా ఉంటుంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications