• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌కు ఇవాంక: చంద్రబాబుపై కెసిఆర్ ఆధిపత్యం?

By Pratap
|

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకను హైదరాబాదు రప్పించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆధిపత్యం సంపాదించారా అనే చర్చ సాగుతోంది.

  GES 2017 Hyderabad Specialities : focusing on women Entrepreneurs

  ఇవాంకతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హైదరాబాద్ వస్తున్నారు. దానికితోడు, ఎన్నాళ్లుగానో హైదరాబాద్ నగర వాసులు ఎదురు చూస్తున్న మెట్రో రైలు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభింపజేయడంతో కెసిఆర్ ప్రతిష్ట పెరిగిందని అంటున్నారు.

  ఇవాంకను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించడానికి చంద్రబాబు విఫలప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే, అందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించలేదని అంటున్నారు.

  హైదరాబాద్ కలిసి వచ్చిందా...

  హైదరాబాద్ కలిసి వచ్చిందా...

  హైదరాబాద్ తెలంగాణకు రాజధాని నగరం కావడం కెసిఆర్‌కు కలిసి వచ్చినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఒక్కటి. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉండడం కూడా కలిసి వచ్చిందని అంటున్నారు. అదే కెసిఆర్ ప్రతిష్టను పెంచడానికి కారణమైందని చెప్పవచ్చు.

  ఇలా చర్చలు..

  ఇలా చర్చలు..

  ఇవాంకను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించాలని చంద్రబాబు ప్రయత్నించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఓ అధికారి తెలిపినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడిబి) ముఖ్య కార్యదర్శి జె. కృష్ణ కిశోర్ అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

  విశాఖలో ఈవెంట్‌కు ..

  విశాఖలో ఈవెంట్‌కు ..

  ఇవాంక ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తే అమరావతి లేదా విశాఖపట్నంలో ప్రత్యేక ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తామని ఆమెరికా కాన్సులేట్‌కు చెప్పినట్లు సమాచారం. అయితే, అందుకు అమెరికా ప్రభుత్వం అంగీరించలేదని అంటున్నారు జిఈఎస్‌కు హాజరు కావడం తప్ప మరెక్కడ కూడా ఇవాంక పర్యటించబోరని తేల్చి చెప్పినట్లు సమాచారం.

  అప్పుడు బిల్ క్లింటన్....

  అప్పుడు బిల్ క్లింటన్....

  బిల్ క్లింటన్ 2000లో చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో పర్యటించారు. హిల్లరీ విజయం కోసం చంద్రబాబు అప్పట్లో ప్రయత్నాలు చేశారని కూడా ప్రచారంలో ఉంది. బిల్ క్లింటన్‌ను హైదరాబాద్ రప్పించడంపై రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పదే పదే చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఇవాంకను రప్పించన ఘనతను కెసిఆర్ అలా ప్రచారం చేసుకుంటారా చూడాలి.

  వైఎస్ హయాంలో జార్జి బుష్

  వైఎస్ హయాంలో జార్జి బుష్

  వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఢిల్లీకి వచ్చిన బుష్ హైదరాబాదుకు కూడా వచ్చారు. హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ముఖ్యమంత్రుల ప్రమేయం కాదనే మాట కూడా ఉంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Debate is going on wether Telangana C K Chandrasekhar Rao has taken upper hand on Andhra Pradesh CM Nara CChandrababu Naidu with Ivanka Trump's Hyderabad visit.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more