ఇవాంకా ట్రంప్ ఎఫెక్ట్, గుజరాత్ ఎన్నికలు: మోడీ ఊహించనిది జరిగిందా?
న్యూఢిల్లీ/హైదరాబాద్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు, ఇవాంకా ట్రంప్ మంగళవారం ప్రారంభమైన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ చాయ్ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగారని కితాబిచ్చారు. ఆయన మార్గదర్శకత్వంలో భారత్ ముందుకు వెళ్తోందన్నారు.
ఇవాంకా వ్యాఖ్యలు ప్రధాని మోడీకి బాగా ఉపయోగపడుతున్నాయని కొందరు అంటున్నారు. త్వరలో గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో ఇవాంకా ప్రశంసలు అందుకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తానికి తన ఒక్క స్టేట్‌మెంటుతో ప్రధాని మోడీకి ఇవాంకా మరింత ఇమేజ్ పెంచిందంటున్నారు.
Recommended Video


మోడీకి ఇవాంకా మరింత ఇమేజ్ తెచ్చారా
తాను టీ అమ్ముకున్నా దేశాన్ని అమ్ముకోలేదంటూ మోడీ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఇవాంకా గ్లోబల్ సదస్సులో ప్రధానిని ప్రశంసించారు. ఇది అంతటా చరచ్నీయాంశంగా మారింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌లో ఇది చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది. టీ అమ్ముకునే మోడీ.. మూడేళ్లలో ఎన్నో సాధించారని ఇవాంకా మంచి ఇమేజ్ తీసుకు వచ్చారని అంటున్నారు. అయితే మోడీకి ఇవాంకా ప్రత్యేకంగా ఇమేజ్ తీసుకు రావాల్సిన అవసరం లేదనే వారు లేకపోలేదు. కానీ ఇక్కడ చాయ్ పేరుతో ప్రశంసించడం మాత్రం గమనార్హం.

మోడీనే తీసుకు వచ్చారు
ఇవాంకా చేసిన ఆ వ్యాఖ్యల్లోనే ఎంతో ఉందని అంటున్నారు. ఆ ఒక్క మాటతో మోడీ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నట్లుగా కనిపిస్తోందని, నిజానికి హైదరాబాద్ సదస్సుకు ఇవాంకాను పంపాలని మోడీ స్వయంగా ట్రంప్ వద్ద ప్రస్తావించారని అంటున్నారు. ట్రంప్ అంగీకరించారు. ఆమె రాక తనకు ఇంత ప్రయోజనకరంగా ఉంటుందని మోడీ కూడా అప్పట్లో ఊహించి ఉండరని అంటున్నారు.

బీజేపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది
గుజరాత్ ఎన్నికల్లో అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ కొంత ఇబ్బందుల్లో పడిందని, కానీ ఇవాంకా వ్యాఖ్యలు వారికి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చాయని చెబుతున్నారు. మోడీ ఢిల్లీకి వెళ్లడంతో గుజరాత్‌లో బీజేపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. అయితే తన స్వస్థలం అయిన గుజరాత్‌లో బిజెపి గెలుపు మోడీకి ఎంతో అవసరం. అందుకు ఆయన పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు.

ఇవాంకా స్టేట్‌మెంటుతో ప్లస్
2014లోను చాయ్ పే చర్చలతో మోడీ జనాలను ఆకట్టుకున్నారు. ఇప్పుడు గుజరాత్‌లోను బీజేపీకి అనుకూలంగానే ఉంది. అయితే తాజా రాజకీయ పరిస్థితులను బట్టి ఆ పార్టీ కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఇవాంకా ప్రకటన బీజేపీలో కొత్త ఉత్సాహం తెచ్చిందని అంటున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఇలాంటి వాటిని ప్రచారం చేసుకోవడానికి ముందుంటారనే విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications