వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంక ధన్యవాద్: థ్యాంక్స్ చెబుతూ ట్వీట్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంకా ట్రంప్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

జీఈఎస్ సదస్సులో పాల్గొనడం తాను గర్వకారణంగా భావిస్తున్నట్లు ఇవాంకా తెలిపారు. హైదరాబాద్‌లో రెండు వారాల క్రితం జరిగిన జిఈఎస్‌పై మంగళవారం ఇవాంకా ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన బృందం ఇవాంకా నేతృత్వంలో సదస్సుకు హాజరైన విషయం తెలిసిందే.

Ivanka Hyderabad visit

ఇవాంక చేసిన ట్వీట్‌ను దాదాపు 1500 మంది భారతీయులు, ఆరువేల మంది విదేశీయులు షేర్ చేశారు. మరో 900 మంది ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఇవాంకా సదస్సు నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ హిందీ పదం ధన్యవాద్ అని వాడడం విశేషం. ఆ పదాన్ని ఆమె హిందీలోనే రాశారు.

జీఈఎస్ సదస్సులో సుమారు 1200 మంది చురుకైన పారిశ్రామికవేత్తలతో సహా తమ దేశానికి చెందిన 350 మంది పాల్గొన్నట్లు ఇవాంకా ఆ ట్వీట్‌లో తెలిపారు. అద్భుతమైన ఆహ్వానం ఇచ్చిన ప్రధాని మోడీకి, భారత దేశ ప్రజలకు థ్యాంక్స్ అంటూ ఆమె ట్వీట్ చేశారు

English summary
Ivanka tweets "It was an honor to participate in GES2017 in Hyderabad, India with 1,200 brilliant and passionate entrepreneurs from around the world, including our delegation of 350 Americans! Thank you Prime Minister Modi and the people of India for the warm hospitality. धन्यवाद! #GES2017".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X