అక్రమాలకు పాల్పడే ఐవీఎఫ్ కేంద్రాల రిజిస్ట్రేషన్ రద్దు : మంత్రి సాలిడ్ వార్నింగ్!

రాష్ట్రంలో ఐవీఎఫ్ కేంద్రాల పేరుతో జరుగుతున్న అక్రమాలు, అండాల అక్రమ సేకరణ, సంతానలేమి బాధిత దంపతులపై జరుగుతున్న ఆర్థిక దోపిడీకి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమాలకు పాల్పడిన ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాల రిజిస్ట్రేషన్‌ను శాశ్వతంగా రద్దు చేయాలని, బాధ్యులైన వైద్యుల లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టంగా ఆదేశించారు.

హైదరాబాద్‌లోని కోఠి టీజీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తదితరులు పాల్గొన్నారు. అండాల అక్రమ సేకరణ ముఠాకు సంబంధించిన తాజా పరిశోధన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు.

IVF irregularities Telangana Health Minister directs permanent cancellation of IVF centre registrations linked to illegal egg trafficking

గతంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌లో జరిగిన అక్రమాలను ప్రభుత్వం అరికట్టినట్లు మంత్రి గుర్తు చేశారు. తాజాగా అండాల అక్రమ సేకరణలో పాల్గొన్న ముఠాను గుర్తించి అరెస్టు చేశామని, ఈ దందాకు సంబంధించి పోలీసులు 43 మంది మహిళలను రక్షించినట్లు సమాచారం. ఇలాంటి అక్రమాలు జరిగిన ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేసి, వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

అక్రమాల్లో భాగస్వాములైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర వైద్య మండలి, నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులతో సంప్రదింపులు జరిపి వారి లైసెన్సుల రద్దుకు సిఫారసు చేయాలని ఆదేశించారు. ఐవీఎఫ్ చికిత్సలో వాడే మందుల తయారీ నుంచి అమ్మకాల వరకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ ప్రత్యేక నిఘా ఉంచాలని కూడా సూచించారు.సంతానలేమితో బాధపడుతున్న అమాయక దంపతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి ఉద్ఘాటించారు.

సరోగసి చట్టం, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టాల అమలును మరింత పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న నియంత్రణ పద్ధతులను అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు సామర్థ్యం పెంచేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ కార్యదర్శికి సూచించారు. ఈ కమిటీ కేంద్ర చట్టాల పరిధిలో అదనపు రాష్ట్రస్థాయి మార్గదర్శకాలను కూడా పరిశీలించవచ్చు.

తెలంగాణ మహిళలకు పండుగవేళ శుభవార్త .. ఉచిత చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ మహిళలకు పండుగవేళ శుభవార్త .. ఉచిత చీరల పంపిణీకి ముహూర్తం ఫిక్స్!

ప్రైవేట్ సంతాన సాఫల్య కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు కొనసాగించాలని, పోలీసు శాఖతో సమన్వయం పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు. అదే సమయంలో సామాన్యులకు నాణ్యమైన ఐవీఎఫ్ సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సేవల విస్తరణను వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు.ఈ చర్యలతో రాష్ట్రంలో ఐవీఎఫ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+