సీఎం ముందుచూపుతోనే మెడీకల్ కాలేజీల ఏర్పాటు.!అన్నిగ్రామల్లో ఆరోగ్య సర్వే అంటున్న జగదీష్ రెడ్డి.!
సూర్యాపేట/హైదరాబాద్: కరోనా క్లిష్ట సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తోందని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ముందు చూపుతో వ్యవహరిస్తుండడంతో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గు ముఖం పడుతున్నాయని మంత్రి తెలిపారు. కరోనా రెండవ దశ విజృంభిస్తున్న తరుణంలో కరోనా బాదితులకు అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనపై చేసే పోరాటంలో భాగస్వామ్యం కావాలని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరి దాతృత్వం వర్తమాననికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

కరోనావైరస్ ను అరికడుతున్న కేంద్రాలుగా వైద్యకళాశాలలు..కళాశాలల ఆవశ్యకతను ప్రజలు గుర్తిస్తున్నారన్న జగదీష్ రెడ్డి..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిని ఎదుర్కోవడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్థలు, సంఘాలు,వ్యక్తిగతంగా కొందరు ఇతోధికంగా సహాయపడడానికి ముందుకు రావడాన్ని మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. కరోనా రెండో దశ ఉదృతం అవుతున్న వేళ అక్షిజన్ ను అందుబాటులో ఉంచడానికి సూర్యాపేట జిల్లాకు చెందిన యన్ఆర్ఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట మెడికల్ కళాశాల కు 10 అక్షిజన్ కాన్సెంట్రేటర్స్ ను బహుకరించారు. వాటిని శనివారం ఉదయం మెడికల్ కళాశాల ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

కొనసాగుతున్న ఫవర్ సర్వే.. కరోనా వస్తే అక్కడికక్కడే కిట్లు అందజేస్తున్నామన్నబమంత్రి
అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ముందు చూపుతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సూర్యాపేట, నల్లగొండ లలో నెలకొల్పిన మెడికల్ కళాశాలలే వయస్సుతో నిమిత్తం లేకుండా కరోనా పేషేంట్ల ప్రాణం నిలుపుతున్నాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు ప్రాణ దానం చేస్తుంటే మెడికల్ కళాశాలల ప్రాశస్త్యాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారని ఆయన తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కృషి, ముందుచూపు, ఆలోచనలే కారణమని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

మానసిక ధైర్యమే కరోనాకు మందు.. అధైర్య పడొద్దన్న మంత్రి జగదీష్ రెడ్డి..
అన్ని గ్రామాల్లో ఆరోగ్య సర్వే జరుగుతుందని, కరోనా సోకిందని గుర్తిస్తే అక్కడికక్కడే కిట్లు అందజేస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోను ఆక్సిజన్ అందుబాటులో ఉందని ఆయన వెల్లడించారు. అన్నింటికీ మించి మానసిక ధైర్యమే కరోనకు మందు అని, కరోనా వైరస్ సోకినంత మాత్రాన ఏ ఒక్కరూ అధైర్య పడొద్దని మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. ప్రభుత్వ ఆసుపత్రిలలోనే మెరుగైన వైద్యం లభిస్తుందని స్పష్టం చేసారు.
ప్రభుత్వ ఆసుపత్రిలలోనే మెరుగైన వైద్యం.. స్పష్టం చేసిన మంత్రి
ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో వైద్యం అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు, ఆయాలు, ఆసుపత్రుల సిబ్బంది పని తీరును ఆయన ప్రశంసించారు. యింకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, స్థానిక మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, మెడికల్ కళాశాల సూపరెండేంట్ దండా మురళీధర్ రెడ్డి, ఆర్యంఓ కళావతి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications