బాబే కాదు జగన్, కేసీఆర్ యూపీఏతో జట్టు కడతారు : జగ్గారెడ్డి జోస్యం
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై ఆయా పార్టీలు ధీమాతో ఉన్నాయి. తామే విజయం సాధించి అధికారం చేపడుతామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ఒకడుగు ముందేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి యూపీఏ కూటమిలోకి మరో రెండు పార్టీలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

జగన్, కేసీఆర్ కూడా ...
కేంద్రంలో ఏర్పడేది యూపీఏ ప్రభుత్వమేనని ధీమాతో ఉన్నారు జగ్గారెడ్డి. ఇప్పటికే తమతో టీడీపీ అధినేత చంద్రబాబు టచ్‌లో ఉన్నారని తెలిపారు. చంద్రబాబే కాదు వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కూడా తమతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు. దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని .. భాగస్వామ్య పక్షాలతో కలిసి యూపీఏ ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పారు.

లోకల్ పోరులో హస్తం హవా ..
కేంద్రంలో కాదు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తోందని లెక్కగట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 20 నుంచి 25 జెడ్పీటీసీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తంగా తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికల్లో 70 సీట్లు గెలుస్తామని అంచనా వేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుందన్నారు.

ఉత్తమే ఉత్తమం
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు, పీసీసీ అధ్యక్షుడి మార్పునకు సంబంధం లేదని చెప్పారు. ఉత్తమ్ తనంతట తాను తప్పుకుంటే తప్ప మార్పు ఉండదని చెప్పారు. ఒకవేళ ఉత్తమ్ తప్పుకుంటే రేవంత్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి బలమైన నేతలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications