జగ్గారెడ్డి వెనుక ఉన్నదెవరు - టార్గెట్ రేవంత్ రెడ్డి : ముదురుతున్న రగడ..!!
తెలంగాణ కాంగ్రెస్ లో జగ్గారెడ్డి జగడం కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ లక్ష్యంగా జగ్గారెడ్డి పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ లో ఇవన్నీ మామూలే అంటూనే పదే పదే రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే, జగ్గారెడ్డి వెనుక ఎవరున్నారు. రేవంత్ వ్యతిరేకుల మద్దతు ఉందా. లేక, జగ్గారెడ్డి అసలు ఆలోచన ఏదైనా ప్రభావం చూపుతోందా. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలతో అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి.
Recommended Video

జగ్గారెడ్డి అసలు టార్గెట్ ఏంటి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని తప్పుపడుతూ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి జగ్గారెడ్డి రాసిన లేఖ మీడియాకు లీకవడంపై పార్టీలో అంతర్గతంగా రచ్చ అవుతోంది. ఇది క్రమశిక్షణ ఉల్లంఘనని, జగ్గారెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలుస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే, జగ్గారెడ్డి తనను కాదని.. .రేవంత్ నే క్రమశిక్షణా కమిటీ ముందుకు ఎందుకు పిలవరంటూ ప్రశ్నించటం వెనుక ఇక, జగ్గారెడ్డి తాడో పేడో తేల్చుకోవటానికి సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.

రేవంత్ నిర్ణయాలను తప్పు బడుతూ
రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తీసుకుంటున్న వరుస నిర్ణయాల పైన జగ్గారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనూ అభ్యర్ది ఎంపిక పైన రేవంత్ తీరు పైన మండిపడ్డారు. తాజాగా.. రైతులతో రచ్చబండ కార్యక్రమంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు మొదలైంది.
కిసాన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లికి వెళ్తానని రేవంత్ ప్రకటించారు. జిల్లాకు చెందిన నేతలకు కనీస సమాచారం ఇవ్వకుండా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనకు తెలియకుండా పీసీసీ చీఫ్ ఎర్రవెల్లికి ఎలా వెళ్తారని జగ్గారెడ్డి బాహాటంగా నిలదీశారు.

రేవంత్ నే మార్చాలంటూ లేఖ
తర్వాత రేవంత్ వ్యవహారశైలి మార్చాలని, లేకుంటే పీసీసీ చీఫ్‌నే మార్చాలని కోరుతూ పార్టీ అధినేత్రి సోని యాకు లేఖ రాశారు. ఆ లేఖ మీడియాకు లీకవడం పార్టీలో దుమారం రేపింది. దీనిని రేవంత్ సీరియస్‌గా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జగ్గారెడ్డి లేఖ రాయటం .. వ్యాఖ్యల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం తరువాత కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
కొన్నిచోట్ల గ్రూపు రాజకీయాలు నడుస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆయా ప్రాంతాల్లో కమిటీ పర్యటించి సమస్యల పరిష్కరిస్తుందని వెల్లడించారు. ఇన్‌చార్జులకు లేఖలు రాయవచ్చని, కానీ బహిర్గతం చేయడం సరికాదని పేర్కొన్నారు. సోనియాకు రాసిన లేఖ లీకవడాన్ని క్రమశిక్షణ ఉల్లంఘనగానే భావిస్తున్నామని, జగ్గారెడ్డిని పిలిచి వివరణ కోరుతామని చెప్పారు.

తేల్చుకోవటానికి సిద్దమయ్యారా
దీని పైన జగ్గారెడ్డి ఘాటుగానే స్పందించారు. తాను సోనియాకు రాసిన లేఖ మీడియాకు లీకైతేనే క్రమశిక్షణ ఉల్లంఘన అయితే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం సమయంలో పార్టీ నియమాలను ఉల్లంఘించి మరీ పెద్దపల్లి అభ్యర్థిని ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు క్రమశిక్షణ పరిధిలోకి రాదా అంటూ ప్రశ్నించారు. అసలు క్రమశిక్షణ పాటించని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి క్రమశిక్షణ గురించి చెప్పాలి. మొదట రేవంత్‌రెడ్డిని పిలిచి మాట్లాడాలని జగ్గారెడ్డి డిమాండ్ చేయటం కలకలం రేపుతోంది.

జగ్గారెడ్డి వెనుక ఉన్నదెవరు
ఆ తరువాతే తాను కమిటీ ముందు హాజరవుతానంటూ జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. అయితే, జగ్గారెడ్డి ఈ మధ్య కాలంగా తరచూ రేవంత్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయటం.. పదే పదే మీడియాలో రేవంత్ పైన వ్యాఖ్యలు చేయటం వెనుక ఇది వ్యక్తిగతంగా కాకుండా.. రేవంత్ ను పార్టీలో వ్యతిరేకిస్తున్న నేతల సహకారం ఉందనే చర్చ పార్టీలో సాగుతోంది. దీంతో..జగ్గారెడ్డి పైన చర్యలకు రేవంత్ తెర వెనుక పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో .. ఇప్పుడు జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications