కాంగ్రెస్ పార్టీకి జగ్గారెడ్డి షాక్ ఇస్తారా? నవంబర్5న ఆ సంచలన ప్రకటన? వ్యూహం ఇదేనా!!

తెలంగాణ రాజకీయాలలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రస్తుతం సైలెంట్ గా కనిపిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయినా ఇప్పటివరకు జగ్గారెడ్డి కనీసం ఒక వ్యాఖ్య కూడా చేయకుండా మౌనం వహించారు. ఆయన కూడా త్వరలోనే పార్టీకి షాక్ ఇస్తారు అన్న చర్చ పార్టీలో ఆసక్తికరంగా మారింది.

గాంధీ భవన్ కు రాకుండా జగ్గారెడ్డి రాజకీయం

గాంధీ భవన్ కు రాకుండా జగ్గారెడ్డి రాజకీయం

కాంగ్రెస్ పార్టీ లో జరిగే ప్రతి రాజకీయ పరిణామాలపై తీవ్రంగా స్పందించే జగ్గారెడ్డి అందుకు భిన్నంగా చాలా సైలెంట్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు నెల రోజులకు పైగా గాంధీ భవన్ కు కూడా రాకుండా జగ్గారెడ్డి తన నియోజక వర్గానికే పరిమితమై రాజకీయాలు చేస్తున్నారు. అయితే జగ్గారెడ్డి వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారు అని పార్టీ శ్రేణుల్లో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తీరుపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు.

 పార్టీలో అంటీముట్టనట్టు జగ్గారెడ్డి తీరు

పార్టీలో అంటీముట్టనట్టు జగ్గారెడ్డి తీరు


గతంలోనే ఓమారు రాజీనామా చేసి, ఆపై రాజీనామాను ఉపసంహరించుకుని మళ్లీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ, ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా మరోమారు జగ్గారెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నెల రోజులుగా సైలెంట్ గా ఉంటున్న జగ్గారెడ్డి నవంబరు నెల వరకూ ఇదే పంథాను కొనసాగిస్తారని, ఈ లోపు పార్టీలో మార్పు రాకపోతే అప్పుడు ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ కు షాక్ ఇస్తారా ? టీఆర్ఎస్ లో చేరతారా? కొత్త పార్టీ పెడతారా?

జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ కు షాక్ ఇస్తారా ? టీఆర్ఎస్ లో చేరతారా? కొత్త పార్టీ పెడతారా?

కాంగ్రెస్ పార్టీని వీడి జగ్గారెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరుతారని కొందరు నాయకులు భావిస్తుంటే, మరికొందరు జగ్గా రెడ్డి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారంటూ చెబుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ మేరకు ఆయన తెరవెనుక చేయాల్సిన పనులను, చాపకింద నీరులా చక్కబెడుతున్నారని ప్రధానంగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో నవంబరు నెల వరకు మార్పు రాకపోతే, కాంగ్రెస్ కు పోటీగా మరో పార్టీ పెట్టాలని జగ్గారెడ్డి భావిస్తున్నప్పటికీ, కొత్త పార్టీ పెడితే ఏ మేరకు సక్సెస్ అవుతుందో అన్నదానిపై కూడా జగ్గారెడ్డి సమాలోచనలు జరుపుతున్నారు అని సమాచారం.

నవంబర్ 5 న జగ్గారెడ్డి సంచలన ప్రకటన ... ఏం చేస్తారో ?

నవంబర్ 5 న జగ్గారెడ్డి సంచలన ప్రకటన ... ఏం చేస్తారో ?


తాను ఆశించిన కీలకమైన మార్పు కాంగ్రెస్ పార్టీ లో వస్తే కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగుతానని లేదంటే దసరా తర్వాత తాను కీలక నిర్ణయం తీసుకుంటానని అనుచరులతో చెబుతున్నట్లుగా సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వడానికి జగ్గారెడ్డి కూడా రెడీ అవుతున్నట్లు గా తాజా పరిణామాలతో తెలుస్తోంది. నవంబర్ 5న జగ్గారెడ్డి గాంధీభవన్లో మీడియా ముందు సంచలన ప్రకటన చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో జగ్గారెడ్డి వేరే పార్టీలోకి వెళ్లడానికి, లేదా తాను కొత్త పార్టీ పెడుతున్నాను అని చెప్పడానికి నవంబర్ 5 ముహూర్తంగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు.

Recommended Video

    Gandhi Bhavan ప్రతిష్టాత్మక మునుగోడు ఎలక్షన్ లో గెలుపే ధ్యేయంగా *Telangana | Telugu OneIndia
    రేవంత్ నాయకత్వానికి పరీక్ష పెడుతున్న సీనియర్ నాయకులు

    రేవంత్ నాయకత్వానికి పరీక్ష పెడుతున్న సీనియర్ నాయకులు


    ఇప్పటికే ఒకసారి రాజీనామా చేసి, మళ్లీ వెనక్కి తీసుకొని రాజకీయంగా అభాసు పాలైన జగ్గారెడ్డి, మళ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఈసారైనా తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ పరిణామాలు వరుసగా కాంగ్రెస్ తెలంగాణా రథసారధి రేవంత్ రెడ్డి నాయకత్వానికి పరీక్షగా మారుతున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+