సిద్దిపేట నుంచే హరీష్ పై పోటీ, BRS ఇక ఉండదు - కవిత సంచలనం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఖాయమైంది. మే లో కొత్త పార్టీ ప్రకటనకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద ఈ మేరకు కస రత్తు జరుగుతోంది. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అసెంబ్లీ స్థానం పైన కవిత తాజా గా స్పష్టత ఇచ్చారు. భవిష్యత్ లో బీజేపీ.. బీఆర్ఎస్ ఉండవంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే.. కవిత బీఆర్ఎస్ లక్ష్యంగా తన పార్టీ అభ్యర్దులను బరిలోకి దించేలా ప్లాన్స్ సిద్దం చేస్తున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే రాజకీయంగా తన కార్యాచరణ ప్రకటించేందుకు కవిత సమాయత్తం అవుతున్నారు.
జాగృతి అధ్యక్షురాలు.. కేసీఆర్ కుమార్తె కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేసారు. తన తొలి ప్రాధాన్యత సిద్దిపేట.. రెండో ప్రాధాన్యత బోధన్ గా ఉందని వెల్లడించారు. సామాజిక తెలంగాణయే తన ధ్యేయమని, 2029 ఎన్నికల్లో ఈ రెండు నియోజక వర్గాల్లో పోటీ చేస్తామని చెప్పిన కవిత.. ప్రజలు సూచించిన పేరునే తన పార్టీకి పెడతామని తేల్చి చెప్పారు. తన కొత్త పార్టీ గురించి ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతుందని.. ఎన్నికల సంఘం వద్ద ప్రాసెస్ జరుగుతుందని వివరించారు. కాగా.. భవిష్యత్ లో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఎన్నికల వరకు తామే ప్రధాన ప్రతిప క్షమని కవిత చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఒకప్పుడు మంత్రులు ఎర్రవల్లికి పోయేవారని.. ఇప్పుడు ఢిల్లీకి పోతున్నారని వ్యాఖ్యానించారు. కాగా... కవిత తాజా కార్యాచరణ గమనిస్తే.. బీఆర్ఎస్ లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు స్పష్టం అవుతోంది. హరీష్ నియోజకవర్గం ఎంపిక వెనుక కవిత భారీ టార్గెట్ ఉన్నట్లు కనిపిస్తోంది.

హరీష్ లక్ష్యంగా సిద్దిపేట నుంచి పోటీ
కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన నాటి నుంచి హరీష్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. సిద్ధిపేట ఎవరి జాగీరు కాదని ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. సిద్దిపేట ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చుకున్నారని గతంలోనే కవిత విమర్శించారు. 2028లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కవిత సిద్దిపేట నుంచి పోటీ చేయడం ఖాయమని తాజా వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది. అదే విధంగా కేసీఆర్ కుమార్తెగా సిద్దిపేట లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. అంతే కాదు ఎక్కువ సార్లు గెలిచినందువల్ల హరీష్ రావు మీద యాంటీ ఇంకెంబెన్సీ కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి మాస్టర్ ప్లాన్ తోనే కవిత ముందుకు సాగుతున్నారనేది స్పష్టం అవుతోంది. అయితే... బీఆర్ఎస్, బీజేపీ పైన కవిత చేస్తున్న వ్యాఖ్యల వెనుక అసలు టార్గెట్ ఎవరనేది క్లారిటీ ఇస్తున్నారు. కొత్త పార్టీ ప్రకటన తరువాత కవిత తన రాజకీయ లక్ష్యం.. భవిష్యత్ ప్రణాళికల పైన స్పష్టత ఇవ్వనున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications