Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రమాదకరం, మద్దతెలా: జైపాల్, మీరు మమ్మల్ని అడగలేదే: తెరాస

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో తమ పార్టీకి చీకటి ఒప్పందం లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ శుక్రవారం చెప్పారు.వారితో తమకు ఉన్నదంతా అభివృద్ధి ఒప్పందమేనని తెలిపారు.

హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో తమ పార్టీకి చీకటి ఒప్పందం లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ శుక్రవారం చెప్పారు. వారితో తమకు ఉన్నదంతా అభివృద్ధి ఒప్పందమేనని తెలిపారు.

తాము అటు ఎన్డీయేలోనూ, ఇటు యూపీఏలోనూ లేమని చెప్పారు. దేశంలో నిజమైన లౌకికవాది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

Jaipal Reddy verus Karne Prabhakar on President elections

రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే ముందు ఎన్డీఏ తెరాసను సంప్రదించిందని, కేసీఆర్‌ సూచన మేరకే దళిత అభ్యర్థిని అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఈ అంశంలో కాంగ్రెస్‌ తమను ఎందుకు సంప్రదించలేదని నిలదీశారు.

కాగా, అంతకుముందు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి తెరాసపై నిప్పులు చెరిగారు. ఎన్డీయే అభ్యర్థికి కేసీఆర్ ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలన్నారు. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ది ఆరెస్సెస్ నేపథ్యం అని తెలిపారు.

రామ్‌నాథ్ ఎంపిక ప్రమాదకరమన్నారు. గతంలో మైనార్టీలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. తెలంగాణ బిల్లులో మీరా కుమార్ కీలకంగా వ్యవహరించారని చెప్పారు. అలాంటి మీరాకుమార్‌కు తెరాస మద్దతివ్వాలని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+