‘విభజన’ అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసలు దోషని ఎంపీ జైరాం రమేష్ ఆరోపించారు. ఏపీ విభజనపై జైరాం రమేశ్‌ ఓల్డ్‌ హిస్టరీ న్యూ జియోగ్రఫీ' పుస్తకాన్ని రాశారు. దీనిని సీనియర్‌ జర్నలిస్టు ఏ కృష్ణారావు 'గడిచిన చరిత్ర తెరిచిన అధ్యాయం' అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.

హైదరాబాద్‌లోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఆదివారం ఈ పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జైరాం రమేశ్ మాట్లాడుతూ 'గడచిన చరిత్ర - తెరిచిన అధ్యాయం' అనే పుస్తకాన్ని తాను అన్ని ఆధారాలతోనూ రాశానని అన్నారు.

రాష్ట్ర విభజనలో తన పాత్ర ఏమీ లేదని, రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఉండాలని ఏపీ విభజన చట్టంలోనే ఉందని, నేడు హైకోర్టు ఏర్పాటు చేయకపోవడానికి కారణం కేంద్ర వైఫల్యమేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వాసులు హైదరాబాద్ సాధిస్తే, ఏపీ వాసులు పోలవరం దక్కించుకున్నారని అన్నారు.

కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన జరగదని సీమాంధ్ర ప్రజలను కిరణే మభ్యపెట్టారని ఆయన అన్నారు. కిరణ్ వల్ల మొత్తం వ్యవస్థ నాశనమైందని, రాజకీయ, సామాజిక, ఆర్థిక కోణాల నుంచి విభజన నిర్ణయం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు.

 ‘విభజన' అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

‘విభజన' అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 2013 అక్టోబర్‌ 8న కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం తీసుకున్ననాడే రాష్ట్ర విభజన ఖాయమైందని విభజన బిల్లు రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ జైరాం రమేశ్‌ చెప్పారు. రాష్ట్ర విభజన శాస్త్రీయంగానే జరిగిందని స్పష్టం చేశారు.

‘విభజన' అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

‘విభజన' అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

రెండుప్రాంతాల్లోని రాజకీయ, సా మాజిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని విభజన చట్టాన్ని రూపొందించామని వెల్లడించారు. ఏపీకి తిరుపతి, శ్రీశైలం పుణ్యక్షేత్రాలున్నందున తెలంగాణ ప్రజల అభ్యర్థన మేరకు ముంపుగ్రామాలను మినహాయించి భద్రాచలాన్ని కేటాయించినట్టు గుర్తు చేశారు.

‘విభజన' అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

‘విభజన' అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

తెలంగాణ ఏర్పాటును విభజనగా పరిగణించలేదని, విలీనమైన రెండు రాష్ట్రాలను (ఆంధ్రా- హైదరాబాద్‌) వేర్వేరుగా గుర్తించినట్లే భావించామని చెప్పారు. ఈకార్యక్రమానికి ఎమెస్కో ప్రచురణ సంస్థ అధినేత విజయ్‌కుమార్‌ సభకు అధ్యక్షత వహించారు.

‘విభజన' అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

‘విభజన' అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

ఆ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ నుంచి బహిష్కృత నేతను కాబట్టి రాష్ట్రవిభజనకు సంబంధించిన అన్ని అంశాలను ప్రజల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు.
భవిష్యతలో తాను ఏ రాజకీయపార్టీలోనూ చేరనని స్పష్టం చేశారు.

 ‘విభజన' అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

‘విభజన' అంశంలో మాజీ సీఎం కిరణే దోషి: ఎంపీ జైరాం రమేష్

కాంగ్రెస్ హైకమాండ్‌ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా రోశయ్య అధ్యక్షత అన్ని పార్టీల సమావేశంలో తెలంగాణ ఏర్పాటు పై ఏకగ్రీవ తీర్మానం చేసినపుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనివార్యమన్న విషయం స్పష్టమైందని ఉండవల్లి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jairam Ramesh book on andhra pradesh bifurcation in telugu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి