వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ గడ్డ మీద జమ్ముకాశ్మీర్ సాంస్కృతిక ఉత్సవం

భాషా, సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో మొట్ట మొదటి సారిగా మన తెలంగాణ రాష్ట్రంలో జమ్ము కాశ్మీర్ ఫెస్టివల్ ని మన రాష్ట్రంలోని 4 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు నేల మీద మొట్ట మొదటిసారిగా జమ్ముకాశ్మీర్ సాంస్కృతిక ఉత్సవం జరగబోతోంది. ప్రకృతి సౌందర్యంతో అలరారే జమ్ముకాశ్మీర్ సాంస్కృతికంగా, కళారూపాల పరంగా కూడా ఎంతో ప్రత్యేకతను సాధించింది.

నైజాం కాలం నుండి తెలంగాణకు కాశ్మీర్ కు అనుబంధం ఉందని చరిత్ర చెపుతుంది. అంతేకాక, హైదరాబాద్ సంస్కృతిని, కాశ్మీర్ సంస్కృతిని కలిపే ఒక అద్భుత వారధి - ఉర్దూ భాష.

ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు హైదరాబాద్ జీవన సంస్కృతిని "గంగా యమునా తెహజీబ్" అని చెప్తుంటారు.

అలాగే హైదరాబాద్ "విశ్వనగరంగా" తీర్చి దిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం - భాషా సాంస్కృతిక శాఖ ఫిబ్రవరి 5, 6 మరియు 7 తేదీల్లో "జమ్ము కాశ్మీర్ సాంస్కృతిక ఉత్సవం" నిర్వహించడానికి సన్నాహాలు చేసింది.

JAMMU KASHMIR CULTURAL FESTIVAL in TELANGANA

భాషా, సాంస్కృతిక శాఖ - తెలంగాణ ప్రభుత్వం ఆద్వర్యంలో మొట్ట మొదటి సారిగా మన తెలంగాణ రాష్ట్రంలో జమ్ము కాశ్మీర్ ఫెస్టివల్ ని మన రాష్ట్రంలోని 4 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు.

జమ్ముకాశ్మీర్ మరియు తెలంగాణ రాష్ట్రాల భాష, సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాల అనుబంధాన్ని బలోపేతం చేయుటకు, సాంస్కృతిక బంధాన్ని ఏర్పాటు చేయుటకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

గత ఏడాది కేంద్ర సంగీత నాటక అకాడమీ సర్వ సభ్య సమావేశంలో ముఖ్యమంత్రి గౌII శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సారథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకోత్సవాలు, జానపద ఉత్సవాల గురించి సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 29 రాష్ట్రాల ప్రతినిధుల ప్రశంసలు అందుకుంది.

ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన జమ్ముకాశ్మీర్ కార్యదర్శి శ్రీ హాజీనీ ఎంతగానో స్పందించి, తెలంగాణ రాష్ట్రంతో సాంస్కృతిక బంధాన్ని రూపొందించుకోవాలని భావించారు. దానిని అనుసరించి ఆయన మన రాష్ట్రానికి వచ్చి గిరిజన, పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రివర్యులు శ్రీ అజ్మీరా చందులాల్, సాంస్కృతిక కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం-IAS, ప్రభుత్వ సలహాదారులు డా. K.V. రమణాచారి (రి IAS), సంచాలకులు మామిడి హరికృష్ణ లను కలిసి చర్చించి తెలంగాణ రాష్ట్రంలో జమ్ము కాశ్మీర్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించవలసినదిగా కోరారు.

JAMMU KASHMIR CULTURAL FESTIVAL in TELANGANA

అలాగే ఇటీవల గుజరాత్ లో జరిగిన "రాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్" లో శ్రీ బుర్రా వెంకటేశం IAS, సెక్రెటరి గారిని శ్రీ హాజీనీ, జమ్ముకాశ్మీర్ సాంస్కృతిక కార్యదర్శి గారు కలిసి ఇరువురూ చర్చించుకోవడంతో తెలంగాణలో "జమ్ముకాశ్మీర్ కల్చరల్ ఫెస్టివల్" కు తుడిరూపు ఏర్పడింది.

ఈ విధంగా కార్యరూపం దాల్చిన ఈ జమ్ముకాశ్మీర్ సాంస్కృతిక ఉత్సవాలు తెలంగాణ ప్రజలకు, కళాభిమానులకు ఈ సంబరాలు కనువిందు కానుంది.

ప్రకృతి సౌందార్యల నుంచి పుట్టిన పాటలు, కాశ్మీర్ లోయల్లో నుంచి వచ్చిన కళారూపాలు, అక్కడి కొండల్లోని ఆచార నృత్యాలు ఇవన్నీ ఒకే వేధిక పై చూసే అరుదైన అవకాశం తెలంగాణ ప్రజలకు రాబోతుంది.

ఈ కార్యక్రమంలో దాదాపుగా 115 మంది కళాకారులు (16 Female & 99 Male) పాల్గొని వివిధ కాశ్మీర్ కళారూపాల ప్రదర్శనలు చేయనున్నారు.

JAMMU KASHMIR CULTURAL FESTIVAL in TELANGANA

కార్యక్రమాల షెడ్యూల్:

05.02.2017: వరంగల్ అర్బన్ జిల్లా (హన్మకొండ)
పద్మశ్రీ డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం @ 6:00 PM

05.02.2017: జనగామ జిల్లా @ 6:00 PM
05.02.2017: మహబూబ్ నగర్ జిల్లా @ 6:00 PM
06.02. 2017: రవీంద్రభారతి, హైదరాబాద్ @ 6:00 PM
07.02. 2017: రవీంద్రభారతి, హైదరాబాద్ @ 6:00 PM

ఈ కార్యక్రమంలో ప్రదర్శించే జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక కళారూపాలు:

Bhand Pather (బాండ్ పతేర్):

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రముఖ, అద్బుతమైన జానపద కళారూపం ఇది. కాశ్మీర్ లోయ సంప్రదాయాన్ని బాండ్ అని, నాటక కళను పతేర్ అని అంటారు. ఇది ఒక సంప్రదాయ జానపద నాటక శైలి, హాస్యంతో కూడిన ప్రదర్శన. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల వద్ద ఈ ప్రదర్శన చేస్తుంటారు. ఇందులో పౌరాణిక ఇతిహాసాలు, సమకాలీన సామాజిక అంశాల పై ప్రదర్శిస్తారు.

Dhamali:
ఇది ఒక భక్తిపరమైన నృత్యం. ఈ నృత్యాన్ని పురుషులు దీవెనలకోసం ప్రార్థిస్తూ ప్రదర్శిస్తారు.

Chakri:
ప్రజల్లో చాలా ప్రాచుర్యం పొందిన కాశ్మీర్ జానపద సంగీతం ఇది. ఈ కళారూపం పేరే చక్రి. సంగీత కారుల బృందంతో సారంగి, వదిన రబాబ్ వంటి ఇతర పాటలు పాడుతూ నాట్య కదలిక ద్వారా ప్రదర్శన ఉంటుంది. ఇది ఎక్కువగా పండుగలకు, వివాహ, విందు, వినోదాల్లో ప్రదర్శిస్తుంటారు. మొదట గ్రామీణానికి పరిమితమైన ఈ కళారూపం రాను రాను పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలను మంత్రముగ్దుల్ని చేసి ప్రజాధారణ పొందుతుంది ఈ కాశ్మీర్ జానపద సంగీతం.

Rouf Dance:
ప్రాచీన కాలంలో అధికంగా ఉన్న నృత్య ప్రదర్శన ఇది.ఈ ప్రదర్శనని ఉత్సవాల సందర్భాలలో ముఖ్యంగా రంజాన్ పండుగ సందర్భాల్లో ప్రదర్శిస్తారు. మహిళలు బృంద ప్రదర్శనగా చేస్తారు.

JAMMU KASHMIR CULTURAL FESTIVAL in TELANGANA

Haran:
పూర్తి సంగీత రూపంలో ఉండే నృత్య మరియు నాటకాలను చూపే జానపదం ఉంటుంది. కాశ్మీర్ కొండ ప్రాంతాల వ్యాప్తంగా జానపదం ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో ఒక కథకుడు, హాస్య నటుడు ఉంటారు.

Kud Dance:
ఈ కళారూపాన్ని ఎక్కువగా జమ్ము పర్వతశ్రేణుల్లో ప్రదర్శిస్తుంటారు. ఇది ఒక విలక్షణమైన నృత్యం. వర్షాకాల సమయంలో (మొక్క జొన్న పంట ఉన్నప్పుడు) గ్రామస్తులు కొండల నుంచి వచ్చి అక్కడి గ్రామ దేవతని వారి పంటలు, పశువులు అలాగే వారి పిల్లలు కుటుంబాన్ని రక్షించాలని వేడుకుంటారు. పిల్లలు, మహిళలు, పురుషులు మంచి సంప్రదాయ రీతులలో తయారు అవుతారు. ఈ సంబరాల సందర్భంగా భోగి మంటలను కాలుస్తారు.

Geetru:
ఈ ప్రదర్శనని పండుగలు, వివాహ, విందు, వినోదాల్లో ప్రదర్శిస్తుంటారు. ఇందులో పురుషులు మరియు మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి గీతాలను ఆలపిస్తూ నృత్య ప్రదర్శన చేస్తారు. ఇది జమ్ము డోగ్రా ప్రాంతంలోని గ్రామీణ జానపద నృత్యం.

Dogri Folk dances: (డోగ్రీ జానపద నృత్యాలు)
యేడాది పొడవునా ఆచార, ఇతర కార్యకలాపాలకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వారికి సంగీతం, నృత్యం, జానపదం అంటే వారికి అమితమైన ఇష్టం.

Jabroo Dance (Ladakhi Dance):
ఇది టిబెట్ , సంచార ప్రాంత ప్రజలు కొండల్లో నివసిస్తున్న వారి నృత్యం. ఈ నృత్యం నూతన సంవత్సర వేడుకల్లో ప్రదర్శిస్తారు. ఇందులో గిటార్, వేణువు వాయిద్యాలను ఉపయోగిస్తారు.

Gojri Folk:
ఇది ఒక జానపద నృత్యం. ఇందులో పాటలు పాడుతూ నృత్యప్రదర్శన గావిస్తారు.

Pahari Folk:
పహారి జానపద నృత్యం ఇది జమ్ము కొండప్రాంతాల్లో పాటలు అలరిస్తాయి.

English summary
The Department of Language and Culture, Government of Telangana is conducting JAMMU & KASHMIR FESTIVAL for 3 days in several of districts in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X