అంబర్‌పేట నాకు తల్లి లాంటిది-అప్పటిలా ఇప్పుడూ గల్లీగల్లీలో తిరగాలనుంది-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భావోద్వేగం..

ప్రస్తుతం తాను కేంద్రమంత్రిగా ఉన్నానంటే కారణం అంబర్‌పేట,సికింద్రాబాద్ ప్రజలేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.అంబర్‌పేటలో అడుగుపెడితే చాలా రోజులకు బిడ్డ తల్లి వద్దకు వచ్చినట్లుగా ఉందని అన్నారు.అంబర్‌పేట తనకు తల్లి లాంటిదని... తనకు జీవం పోసిందని అన్నారు. అంబర్‌పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పనిచేస్తానని చెప్పారు. పార్టీ,అంబర్‌పేట తనకు రెండు కళ్లతో సమానమని వ్యాఖ్యానించారు. జన ఆశీర్వాద్ యాత్రలో భాగంగా శనివారం(ఆగస్టు 21) అంబర్‌పేట్‌లో కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.

దీపావళి వరకు ఆ స్కీమ్...

దీపావళి వరకు ఆ స్కీమ్...

కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొన్నదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 57 కోట్ల మందికి ఉచిత వ్యాక్సిన్ అందించామన్నారు. దేశంలోని మొత్తం 130 కోట్ల మందికి రెండు డోసులు చివరి వరకూ ఉచితంగానే అందిస్తామన్నారు. కరోనా కాలంలో దేశంలోని పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని గతేడాది ఏప్రిల్ నుంచి 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.వచ్చే దీపావళి వరకు దీన్ని కొనసాగిస్తామని.... అవసరమైతే మరింత కాలం పొడగిస్తామని తెలిపారు.

ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని...

ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలని...

బహిరంగ ప్రదేశాల్లో ప్రతీ ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో తాను ఇంట్లో తప్ప ఎక్కడా మాస్కు తీయలేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో వెంటిలేటర్ల వార్డుకు 9 సార్లు వెళ్లానని... మాస్కు పెట్టుకుని తగిన జాగ్రత్తలతో వెళ్లినందునే కరోనా తననేమీ చేయలేదని అన్నారు. తాను కరోనాను జయించానని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో ఆస్పత్రులు తిరిగానని... ఎంతోమంది రోగులను కలిశాననని... ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయించానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తప్పనిసరిగా మాస్కులు ధరించాలని,తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై...

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై...

వరంగల్‌లో రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చేందుకు గతంలో పనిచేశానని.. దురదృష్టవశాత్తు అప్పట్లో అది సాధ్యపడలేదని అన్నారు. కేంద్రం పర్యాటకమంత్రిగా నియమించబడ్డాక ఇదే విషయమై ప్రధాని మోదీతో మాట్లాడానని చెప్పారు. యునెస్కో గుర్తింపు రాకపోవడానికి ఏయే దేశాలైతే అడ్డు చెప్పాయో... ఆయా దేశాలను ఒప్పించగలిగామని అన్నారు.రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో అంబర్‌పేట బిడ్డ కీలక పాత్ర పోషించాడని చెప్పారు. అలాగే గోల్కొండ కోటను కూడా అభివృద్ది చేస్తామని చెప్పారు. ఏ పదవిలో ఉన్నా అంబర్‌పేట ప్రజలకు అందుబాటులోనే ఉంటానన్నారు.

ఇప్పుడు అలా తిరగాలని ఉందని...

ఇప్పుడు అలా తిరగాలని ఉందని...

గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంబర్‌పేటలో గల్లీగల్లీ తిరిగేవాడినని... ఇప్పుడూ అలా తిరగాలని మనసులో ఉందన్నారు. కానీ అందుకు తగిన సమయం లేదన్నారు. ప్రస్తుతం తాను నిర్వర్తిస్తున్న బాధ్యత పెద్దదని... అందరినీ కలవడం,అభివృద్ది కార్యక్రమాలను సమీక్షించడం... ఇలా చాలా పనులు ఉంటాయని చెప్పారు. భవిష్యత్తులోనూ అంబర్‌పేట్ ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.అంతకుముందు, యాదాద్రీ లక్ష్మి నర్సింహాస్వామిని కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అంతకుముందు కేంద్ర మంత్రికి ఆలయ ఈవో గీత, అర్చకులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు కిషన్‌ రెడ్డికి ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు.

యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి దర్శనం...

యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి దర్శనం...

అనంతరం యాదాద్రి ఆలయం నిర్మాణ పనులను పరీశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలపై ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో పర్యాటక శాఖను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ వ్యాప్తంగా పర్యాటక రంగాన్ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్ర పండుగలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందే విధంగా ప్రయత్నాలు చేస్తానని తెలిపారు.రాష్ట్రంలో ఉన్న పలు చారిత్రక కట్టడాలతో పాటు పలు దేవాలయలను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్రంలోని భద్రాచలంతో పాటు , వేములవాడ ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలని కోరారు. గత ప్రభుత్వాలు దేవాలయాల అభివృద్దిని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ అధికారులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సత్కరించారు.

దేశవ్యాప్తంగా బీజేపీ జన ఆశీర్వాద యాత్ర...

దేశవ్యాప్తంగా బీజేపీ జన ఆశీర్వాద యాత్ర...

నూతన కేంద్రమంత్రులను ప్రజలకు పరిచయడం చేయడంతో పాటు పనిలో పనిగా పార్టీని,ప్రభుత్వాన్ని జనానికి మరింత చేరువ చేసేలా బీజేపీ జన ఆశీర్వాద్ యాత్రలకు శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగా ఆగస్టు 19, 2021 నుంచి మూడు రోజుల పాటు కిషన్ రెడ్డి జన ఆశీర్వాద జరగనుంది.12 జిల్లాలు, 7 పార్లమెంట్ స్థానాలు, 17 అసెంబ్లీ సెగ్మెంట్లు కవర్ అయ్యేలా మొత్తం 324 కిలోమీట‌ర్ల మేర యాత్రను ప్లాన్ చేశారు. తిరుపతి నుంచి ప్రారంభమైన యాత్ర కోదాడ ద్వారా తెలంగాణలోకి ప్రవేశించింది. ఆ మరుసటి రోజు సూర్యాపేట,దంతాలపల్లి,తొర్రూరు, రాయ‌ప‌ర్తి, వ‌ర్ధన్నపేట మీదుగా వ‌రంగ‌ల్‌కు చేరింది.వరంగ‌ల్‌లో భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని, అమ‌రవీరుల స్థూపం వ‌ద్ద కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. వరంగల్ నుంచి జనగామ,ఆలేరుకు యాత్ర చేరుకోగా... రాత్రికి యాదాద్రిలో బస చేశారు. ఉదయం యాదాద్రి నుంచి ఘట్‌కేసర్,ఉప్పల్,అంబర్‌పేట్ మీదుగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. యాత్రలో భాగంగా మొత్తం 40 చోట్ల సభలకు ఏర్పాటు చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు,పార్టీ కీలక నేతలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు.కొత్తగా కేంద్రమంత్రులుగా ఎంపికైన 43 మంది బీజేపీ ఎంపీలు జన ఆశీర్వాద్ యాత్రను నిర్వహిస్తున్నారు. ఒక్కో కేంద్రమంత్రి 3-4లోక్‌సభ నియోజకవర్గాలు,4-5 జిల్లాలను కవర్ చేస్తూ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గానికి చేరుకుంటారు.దేశవ్యాప్తంగా దాదాపు 150 లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేసేలా 15వేల కి.మీ మేర యాత్రను ప్లాన్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+