కూల్చం, కానీ వద్దు!: కేసీఆర్‌కు జానారెడ్డి హామీ

Jana Reddy promises K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెరాస ప్రభుత్వాన్ని పడవేయాలన్న ఆలోచన తమకు లేదని, ఒకవేళ ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానారెడ్డి సోమవారం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక విలువలకు లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం పడిపోతుందేమోనన్న భయంతో కేసీఆర్ ప్రతిపక్ష సభ్యులను ప్రలోభపెట్టి ఫిరాయింపులకు ప్రేరేపిస్తూ అనైతిక చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టన్నారు. గతంలో తెరాసను చీల్చడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కాంగ్రెస్ అగ్రనాయకులు ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు తాను తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పారు.

పార్టీలు ఫిరాయించిన వారిపై చర్యలు చేపట్టడంలో స్పీకర్ జాప్యం చేస్తుండటం ఫిరాయింపుదారుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందన్నారు. తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తికి స్పీకర్ తక్షణమే స్పందించి ఉంటే పరిస్థితి ఇంతగా దిగజారి ఉండేది కాదన్నారు.

స్పీకర్ జాప్యం వల్లే ఫిరాయింపులకు అడ్డూ అదుపూ లేకుండాపోతోందన్నారు. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు నిర్లజ్జగా పాలకపక్ష సభ్యుల పక్కనే కూర్చోవటాన్ని చూస్తున్న ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ నాయకత్వం లోపం వల్ల వెళ్తున్నారనడం సరికాదన్నారు.

అధికార పార్టీలోకి వెళ్తే పదవులు లభిస్తాయని ఆశిస్తున్న వారికి నిరాశే మిగులుతుందన్నారు. కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికై పార్టీ ఫిరాయించిన వారు సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా పార్టీ ఫిరాయించిన రెడ్యా నాయక్, యాదగిరి సహా ఇంతకుముందే గోడ దూకేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

మొదట స్పీకర్‌తో సంప్రదించి ఆయన నుంచి సానుకూల స్పందన రాకపోతే హైకోర్టు లేదా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రలో కాంగ్రెస్ తిరిగి పుంజుకుని అధికారంలోకి రాగలదని ధీమాను వ్యక్తం చేశారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+