కెసిఆర్-బాబు కలిసుండాలి, పొగడటమే నా పని: కెటిఆర్‌ని 50కోట్ల లెక్క అడిగిన జానా

నల్గొండ/హైదరాబాద్: తాను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లడం లేదని కేవలం సందేశాన్నే పంపించానని, తెలుగు రాష్ట్రాల సీఎంల కలయిక ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి సోమవారం అన్నారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్‌ల కలయిక ఇలాగే కొనసాగాలని జానారెడ్డి ఆకాంక్షించారు. తాగునీటికి తెలంగాణ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించడం కంటే మీరు ఏం చేశారో చెబితే బాగుంటుందని మంత్రి కెటిఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

నేను మంత్రిగా ఉన్నప్పుడు సిరిసిల్లకు కేటాయించిన రూ.50 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు చేయలేదని చెప్పారు. దీనిపై మంత్రి కెటిఆర్ సమాధానం చెప్పాలన్నారు. రెండేళ్లలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తే మీ ప్రభుత్వాన్ని పొగడటమే నా పని అన్నారు. మేం శంకుస్థాపనలు చేసిన వాటికే మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు.

Jana Reddy responds on KCR and Chandrababu meeting

గవర్నర్‌తో టిడిపి నేతల భేటీ

గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సోమవారం భేటీ అయ్యారు. రైతు సమస్యలు, రైతు రుణమాఫీ పైన వారు ఆయనకు ఫిర్యాదు చేశారు.

రావణాసురుడికి పది తలలు ఉంటే...: జైపాల్ రెడ్డి

రావణాసురుడికి పది తలలు మాత్రమే ఉన్నాయని, ఆరెస్సెస్ నేతలకు మాత్రం వంద తలలు ఉన్నాయని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఆరోపించారు. ఈ మధ్యాహ్నం మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలసి మీడియాతో మాట్లాడారు.

ఆ సంస్థ రావణాసురుడిని మించిన రాక్షస శక్తులన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఓ వైపు మత విద్వేషాలను ప్రేరేపిస్తూ, మరోవైపు బీజేపీ నేతలను వారిస్తున్నట్లు, వారిపై కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నారన్నారు. సంఘ్ ఆగడాలను అడ్డుకునేందుకు అందరూ ఏకతాటిపైకి రావాలన్నారు.

వెనుకబడేయబడిన నియోజకవర్గం: హరీష్ రావు

మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ వెనుకబడేయబడిన నియోజకవర్గం అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇక నారాయణ ఖేడ్ ప్రజలకు అభివృద్ధి చెందే అవకాశం వచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బలపర్చాలన్నారు.

నారాయణ ఖేడ్‌లో రెండు మార్కెట్ యార్డులు నిర్మిస్తామని, 100 పడకల ఆస్పత్రిని 150 పడకల మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిని మంజూరు చేస్తామని, వచ్చే ఏడాదిన్నరలో రూ.870 కోట్లతో ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరు అందిస్తామ్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ కళాశాలను ప్రారంభిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+