మా కోసం బాహుబలి వస్తాడు: జానారెడ్డి కొత్త స్లోగన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:తెలంగాణలో అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకుగాను బహుబలి వస్తాడని ఆయన జోస్యం చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన విమర్శలు గుప్పించారు. అంకెల గారడీ అంటూ ఆయన ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ప్రతి ఏటా 15 శాతం కూడ ఆదాయం పెరగదని అయితే 30 శాతం ఆదాయం పెంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.

janaredddy sensational comments on next elections

బడ్జెట్ పై తాను మాట్లాడడం ఇదే చివరిసారని ఆయన పునరుద్ఘాటించారు.వచ్చే ఏడాది నుండి తమ పార్టీకి చెందిన యువ ఎమ్మెల్యేలు బడ్జెట్ పై మాట్లాడుతారని ఆయన చెప్పారు. కొత్త ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బావించి ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.

బహుబలి వస్తాడు

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకుగాను బాహుబలి వస్తాడని ఆయన చెప్పారు. సినిమాను ఎవరూ క్లోజ్ చేస్తారో ఆయనే బహుబలి అంటూ ఇయన చమత్కరించారు. ఎవరి తల రాత ఎలా ఉందో ఎవరికి తెలుసునంటూ ఆయన చెప్పారు.ఆదర్శ రాజకీయాలకు తాను విత్తనం లాంటివాడినని చెప్పాడుఎవరు ఐరన్ లెగ్ ఎవరో ప్రజలు తేలుస్తారంటూ ఆయన చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
clp jana reddy sensational comments on telagnagan congress party.bahubali will work for congress party next elections.
Please Wait while comments are loading...