మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి: పవన్, హైదరాబాద్‌లో జనసేన ఐటీ సెంటర్

హైదరాబాద్: తాను ఇరవై అయిదేళ్ల పాటు రాజకీయాలు చేసేందుకు వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం అన్నారు. హైదరాబాదులోని రాయదుర్గంలో జనసేన ఐటీ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.

సామాజిక బాధ్యతతో కూడిన రాజకీయాలు తేవాలన్నదే తన ఆశయమని తెలిపారు. రాత్రికి రాత్రే పార్టీ నిర్మాణం జరగదని చెప్పారు. పాతికేళ్ల పాటు రాజకీయాలు చేయడానికి సిద్ధపడే వచ్చానని చెప్పారు.

JanaSena Chief Pawan Kalyan inaugurating JSP IT Centre, Raidurgam, Hyderabad.

సమాజంలో అండదండలు కరువైన వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పారు. రెండు కోట్ల మంది జనసేన సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. ఒక్క సీజన్లో 10 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయని చెప్పారు. అందులో ఏడెనిమిది లక్షలు పూర్తయ్యాయని చెప్పారు.

క్షేత్రస్థాయిలోకి 20 లక్షల పుస్తకాలు పంపించామని చెప్పారు. సామాజిక బాధ్యతతో కూడిన రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో రావాలనేది జనసేన ఉద్దేశ్యమని చెప్పారు. సహనంతో పార్టీ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఎవరైతై సమస్యలలో కూరుకుపోయి ఉన్నారో వారికి జనసేన అండగా ఉంటుందని, వారికి చేరువ అవుతామని చెప్పారు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగానే ఉన్నానని వ్యాఖ్యానించారు.

కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తలు పవన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. కాల్ సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన వారిని మరోసారి ఇక్కడే కలుస్తానని, ఈసారి ఫోటో గ్రాఫ్ తీయించుకోలేకపోయినా, మరోసారి వస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+