వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ 2019: 2 రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ, పవన్ ప్లాన్ ఇదే!

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనున్నట్టు తెలంగాణ జనసేన పార్టీ ఇంఛార్జీ శంకర్‌గౌడ్ ప్రకటించారు.

ప్రత్యేక హోదా: పవన్ పాదయాత్ర, బాబు, జగన్‌కు చెక్ పెట్టే జనసేన ప్లాన్ ఇదే!ప్రత్యేక హోదా: పవన్ పాదయాత్ర, బాబు, జగన్‌కు చెక్ పెట్టే జనసేన ప్లాన్ ఇదే!

2019 ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుండి సమాయాత్తమౌతోంది. 2014 ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు.

టార్గెట్ 2019: 840 మంది ఇంఛార్జీలు, ప్రముఖులకు జనసేన తీర్థం, పవన్ ప్లాన్ ఇదే!టార్గెట్ 2019: 840 మంది ఇంఛార్జీలు, ప్రముఖులకు జనసేన తీర్థం, పవన్ ప్లాన్ ఇదే!

2014 ఎన్నికల్లో ఏపీ,తెలంగాణ రాష్ట్రాలు విడిపోయాయి. ఆ సమయంలో ఈ రెండు రాష్ట్రాల్లో పవన్‌కళ్యాణ్ బిజెపి, టిడిపి కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తోంది.

2019 ఎన్నికల్లో స్థానాల్లో పోటీ

2019 ఎన్నికల్లో స్థానాల్లో పోటీ

2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జనసేన పార్టీ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ శంకర్‌ గౌడ్ ప్రకటించారు.ఏపీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నుండి జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ పోటీ చేయనున్నారు. అయితే పవన్‌కళ్యాణ్ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు జనసేన కసరత్తు చేస్తోంది.ఇప్పటి నుండి పార్టీ యంత్రాంగాన్ని జనసేన సన్నద్దం చేస్తోంది.

ఇతర పార్టీలకు భిన్నంగా

ఇతర పార్టీలకు భిన్నంగా

ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకు భిన్నంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉండేలా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ మేరకు తమ పార్టీలో చేరే వారి విషయంలో జనసేన చాలా జాగ్రత్తలు తీసుకొంటుంది. ఇతర పార్టీల కంటే జనసేన చాలా భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ టీమ్ వ్యవహరిస్తోంది.

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా

ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా

రెండు రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ వ్యూహ రచన చేస్తున్నారు. తొలుత జనవరి మాసం నుండి పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంతో పాటు విశాఖకు ప్రత్యేక రైల్వే డివిజన్ అంశంపై పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎప్పటి నుండి , ఎక్కడి నుండి పాదయాత్ర చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి

కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో జనసేన పార్టీ సమన్వయకర్తల ఎంపిక కార్యక్రమాన్ని హైదర్‌నగర్‌ డివిజన్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించారు. ఇందులో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మాల్కాజిగిరి, పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన 800 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు అందించనున్నట్టు పరిశీలకులు తెలిపారు.

English summary
janasena Incharge Shanker goud said that janasena contest in all assembly segments in Ap and Telangana states in coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X