వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pawan Kalyan: ట్రాఫిక్‍లో చిక్కుకున్న పవన్ కల్యాణ్.. పోలీసులు ఏం చేశారంటే..!

|
Google Oneindia TeluguNews

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచార రథమైన వారాహికి పూజలు చేయించడానికి జగిత్యాల జిల్లా కొండగట్టుకు బయల్దేరారు. ఈ క్రమంలో పవన్ కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కొండగట్టు బయల్దేరారు. పవన్ ఉదయం 11 గంటలకు కొండగట్టు చేరుకుని పూజలు చేయాల్సి ఉంది. కానీ ఆయన కాన్వాయ్ హకీంపేట వద్ద ట్రాఫిక్ లో చిక్కుకుంది.

హకీంపేట

హకీంపేట

హకీంపేట వద్ద రోడ్డు పెద్దగా లేకపోవడంతో పాటు లారీ నడి రోడ్డుపై ఆగిపోవడంతో వాహనాలు అన్ని రోడ్డుపై నిలిచిపోయాయి. దీంతో పవన్ కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుంది. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు లారీని పక్కకు లాగారు. తర్వాత ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దీంతో పవన్ అక్కడి నుంచి కొండగట్టుకు బయల్దేరారు. ట్రాఫిక్ వల్ల సామాన్య వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు.

నాచుపల్లి

నాచుపల్లి

షెడ్యూలు ప్రకారం ఉ.11 గంటలకు పవన్ కొండగట్టు అలయానికి చేరుకోవాల్సి ఉండే. ట్రాఫిక్ అంతరాయం వల్ల ఆలస్యం అయింది. కొండగట్టుకు చేరుకున్న పవన్ ముందుగా అంజనేయస్వామిని దర్శించుకుంటారు. తర్వాత వారాహి ప్రచార రథానికి వాహన పూజ నిర్వహిస్తారు. అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లి వెళ్లి జనసేన ముఖ్య నేతలతో సమావేశమవుతారు.

సెల్ఫీలు

సెల్ఫీలు

సాయంత్రం 5 గంటలకు పార్టీ కార్యకర్తలతో సమావేశం తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. కాగా కొండగట్టు బృందావనం రీసార్ట్ వద్ద పవర్ స్టార్ అభిమానుల భారీగా చేరుకున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న వారాహి వాహనంతో అభిమానుల సెల్ఫీలు తీసుకుంటున్నారు.

English summary
Jana Sena president Pawan Kalyan left for Kondagattu in Jagityala district to offer prayers to Varahi, the campaign chariot. In this order, Pawan's convoy got stuck in the traffic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X