పవన్ కళ్యాణ్ తీరు బాధించింది: బండి సంజయ్, జనసేనాని మళ్లీ బాబు పంచకే అంటూ ఏపీ మంత్రి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

పవన్ కళ్యాణ్‌తో పొత్తు విషయం చర్చిచలేదు

పవన్ కళ్యాణ్‌తో పొత్తు విషయం చర్చిచలేదు

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి టీఆర్ఎస్ డబ్బులు పంపిణీ చేసిందని మండిపడ్డారు. అయినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని సంజయ్ అన్నారు. టీఆర్ఎస్‌కు రెండోస్థానం కూడా దక్కదని అన్నారు. పొత్తు విషయంలో జనసేనతో ఎప్పుడూ చర్చించలేదని బండి సంజయ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ నిర్ణయం బాధించింది..

పవన్ కళ్యాణ్ నిర్ణయం బాధించింది..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతివ్వడం బాధించిందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను వ్యతిరేకించిన జనసేన.. ఇవాళ మద్దతివ్వడంతో జనంలో అయోమయం ఏర్పడిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన న్యూట్రల్‌గా ఉంటే బాగుండేదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ బీజేపీ అన్యాయం చేసిందని అనుకుంటే తనతో మాట్లాడి ఉంటే బాగుండేదని అన్నారు. పవన్ కళ్యాణ్ తీరు సరిగా లేదన్నారు.

టీఆర్ఎస్‌కు మద్దతిచ్చి షాకిచ్చిన పవన్ కళ్యాన్

టీఆర్ఎస్‌కు మద్దతిచ్చి షాకిచ్చిన పవన్ కళ్యాన్

కాగా, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో తెలంగాణ బీజేపీ వ్యవహార శైలిసరిగా లేదన్నారు పవన్ కళ్యాణ్. జనసేనను పట్టించుకోవడం లేదని తెలిపారు. గౌరవం లేని చోట తాముండబోమన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీ కూతురు వాణీదేవిని గెలిపించాలని కోరారు. పీవీ నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి దిశానిర్ధేశం చేసిన వ్యక్తి అని పవన్ పేర్కొన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో కోడ్ ఉల్లంఘిస్తూ పీవీ కూతురుకు మద్దతంటూ ప్రకటించడంపై ఎన్నికల సంఘం జనసేనానికి నోటీసులు జారీ చేసింది.

బీజేపీకి షాక్.. చంద్రబాబు పంచకే పవన్ కళ్యాన్

బీజేపీకి షాక్.. చంద్రబాబు పంచకే పవన్ కళ్యాన్

ఇది ఇలావుంటే, పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని వదిలించుకునే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారని అన్నారు. అంతేగాక, పవన్ చివరికి చంద్రబాబు పంచనే చేరుతారని అన్నారు. తెలంగాణలో బీజేపీకి షాకిచ్చి టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతివ్వడం ఉందుకు నిదర్శనమని అన్నారు. మొదటి టీడీపీ-బీజేపీతో కలిసిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత వామపక్షాలతో కలిసి పోటీ చేసినా ఫలితం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో మళ్లీ బీజేపీ వెంట వెళుతున్నారన్నారు. ఇప్పుడు పవన్ వైఖరిలో మార్పు వచ్చిందని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+