Janasena 336 స్థానాల్లో పోటీ, ఊహించని ఫలితాలతో షాక్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరుణంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆధిక్యం కొనసాగిస్తుండగా... ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తమ బలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, పరిమిత స్థాయిలో పోటీ చేసిన జనసేన పార్టీ ఫలితాలు మాత్రం విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకెళ్తున్న తరుణంలో, కొన్ని చోట్ల చిన్న పార్టీలకు కూడా అవకాశాలు లభించాయి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలిక 14వ వార్డులో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి 60 ఓట్ల మెజారిటీతో గెలవడం ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్లో 31 ఓట్ల మెజార్టీతో కార్పొరేటర్ గా జనసేన అభ్యర్థి అగ్గు సాగర్ గెలుపొందారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను వెనక్కు నెట్టడం స్థానిక స్థాయిలో ఓ రాజకీయ సందేశంగా భావిస్తున్నారు.

అయితే ఈ ఒక్క విజయాన్ని రాష్ట్ర స్థాయి ప్రభావంగా చూడాలా? లేక స్థానిక సమీకరణాల ఫలితంగా చూడాలా? అన్నది విశ్లేషణకు వస్తోంది. నేరేడుచర్లలో వ్యక్తిగత ఇమేజ్, స్థానిక సమస్యలపై ఫోకస్, వార్డు స్థాయి క్యాంపెయిన్ కీలకంగా పనిచేసి ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Janasena 336 స్థానాలు - ఫలితాల ప్రభావం
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 336 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ప్రారంభంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారని ప్రకటించినప్పటికీ, అది అమలులోకి రాలేదు. ప్రచారం జరిగినా గెలిచే పరిస్థితి లేదని కొందరు విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ కొనసాగుతున్న నేపథ్యంలో జనసేనకు స్పష్టమైన ఓటు బ్యాంక్ కనిపించలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
పార్టీ తరఫున ఆర్‌కే సాగర్, హైపర్ ఆది వంటి క్యాంపెయినర్లు కొన్ని ప్రాంతాల్లో ప్రచారం చేసినా, అది రాష్ట్రవ్యాప్త ప్రభావాన్ని చూపలేకపోయిందని విశ్లేషకులు అంటున్నారు. జనసేనకు తెలంగాణలో బలమైన కేడర్, సంస్థాగత నిర్మాణం ఇంకా అభివృద్ధి దశలోనే ఉందనే అభిప్రాయం బలపడుతోంది.
సొంత కుటుంబీకులే ఓటేయలేదే..!
సంగారెడ్డి మున్సిపాలిటీ 4వ వార్డులో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనసేన అభ్యర్థి జంగా కోమరయ్యకు మొదట 2 ఓట్లు రావడంతో రీకౌంటింగ్ కోరగా, తీరా లెక్కింపు అనంతరం ఒక్క ఓటే రావడం చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యులే ఓటు వేయలేదా? అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇది పార్టీ ప్రతిష్ఠకు చిన్నదైనా దెబ్బగా మారింది.
తెలంగాణలో జనసేన భవిష్యత్తు?
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికార బలం, బీఆర్ఎస్ ప్రాంతీయ పట్టు, బీజేపీ జాతీయ స్థాయి మద్దతు.. ఈ మూడు శక్తుల మధ్య జనసేనకు స్థానం సంపాదించడం సవాల్‌గా మారింది. ఒకవైపు నేరేడుచర్ల విజయం ఆశాకిరణంగా కనిపిస్తే, మరోవైపు సంగారెడ్డి ఘటన పార్టీ సంస్థాగత బలహీనతను గుర్తుచేసింది.
మొత్తానికి, ఈ మున్సిపల్ ఫలితాలు జనసేనకు ప్రతికూల సంకేతాలు ఇచ్చాయి. తెలంగాణలో బలమైన కేడర్ నిర్మాణం, స్థానిక నాయకత్వ అభివృద్ధి, స్పష్టమైన రాజకీయ దిశ.. ఇవి లేకుండా స్థిరమైన విజయాలు సాధించడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేనకు ఇది హెచ్చరికా? లేక కొత్త ప్రారంభానికి అవకాశం? అన్నది రాబోయే ఎన్నికలే నిర్ణయించాలి.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications