Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్‌లో అప్పుడే టికెట్ల లొల్లి .. పొన్నాల లక్ష్మయ్యపై జంగా రాఘవరెడ్డి షాకింగ్ ఆడియో!!

ఆలు లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు తయారయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి దిగజారి పోతుంటే, పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంటే పార్టీలో నేతలు మాత్రం ఇప్పటినుంచే టికెట్ల కోసం తగవులు ఆడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా జనగామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పొన్నాల లక్ష్మయ్య పై సంచలన ఆరోపణలు చేసిన, అలాగే వచ్చే ఎన్నికల్లో టికెట్లు తనకే కావాలని అంటున్న ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జనగామ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే టికెట్ల కోసం ముష్టి యుద్ధాలు మొదలైనట్లుగా చర్చ జరుగుతుంది.

రోజురోజుకీ తెలంగాణాలో దయనీయంగా మారుతున్న కాంగ్రెస్ పరిస్థితి

రోజురోజుకీ తెలంగాణాలో దయనీయంగా మారుతున్న కాంగ్రెస్ పరిస్థితి


తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రోజు రోజుకు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. అటువంటి చోట కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు తీసుకు వెళ్లాల్సిన నేతలు ఆ పని చేయకపోగా, సొంత పార్టీలోని నేతలపై రాజకీయాలు చేస్తున్నారు. 24 గంటలు కాంగ్రెస్ పార్టీలోని నేతలకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరినొకరు తిట్టిపోసుకోవడం, చిన్న చిన్న విషయాలకు రచ్చ చేసుకోవడం అలవాటుగా మారింది.

జనగామ కాంగ్రెస్ లో అప్పుడే టికెట్ల లొల్లి

జనగామ కాంగ్రెస్ లో అప్పుడే టికెట్ల లొల్లి

ఇక తాజాగా వచ్చే ఎన్నికలలో తనకే జనగామ నుంచి టిక్కెట్ కావాలని జనగామ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో, కాంగ్రెస్ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య డ్రామా ఆడుతున్నారని జంగా రాఘవరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో దుమారంగా మారాయి. ఇంతకు ఏం జరిగిందంటే జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి మాట్లాడిన ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక కార్యకర్తతో ఆయన మాట్లాడిన ఆడియో కాల్ లో జంగా రాఘవరెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పై సంచలన ఆరోపణలు చేశారు.

మంత్రిగా ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్యకు తాను 10 కోట్ల కమిషన్ ఇప్పించానన్న జంగా

మంత్రిగా ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్యకు తాను 10 కోట్ల కమిషన్ ఇప్పించానన్న జంగా

మంత్రిగా ఉన్న సమయంలో పొన్నాల లక్ష్మయ్యకు తాను 10 కోట్ల కమిషన్ ఇప్పించానని జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. అంతేకాదు పొన్నాల స్థానికంగా ఎవరిని నాయకులుగా ఎదగనివ్వలేదని, ఆయన కొడుకు, కోడలు సైతం ఆయనతో లేరని జంగా రాఘవరెడ్డి విమర్శించారు. పొన్నాల సొంత ఊరు ఖిలాషాపూర్ గ్రామానికి రోడ్డును కూడా తానే మంజూరు చేయించానని జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన గుండె మీద చెయ్యి వేసుకుని ఆత్మ విమర్శ చేసుకోవాలని జంగా రాఘవరెడ్డి అన్నారు.

తనకు టికెట్ ఇవ్వకుంటే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా అంటున్న జంగా

తనకు టికెట్ ఇవ్వకుంటే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా అంటున్న జంగా

పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జంగా రాఘవరెడ్డి జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం పొన్నాల లక్ష్మయ్య డ్రామా ఆడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తనకే టికెట్ ఇవ్వాలని, పార్టీ టికెట్ తనకు ఇవ్వకుంటే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని తాను అధిష్టానానికి తేల్చి చెప్పానని జంగా రాఘవరెడ్డి వెల్లడించారు. జిల్లా అధ్యక్ష పదవి విషయంలోను పొన్నాల లక్ష్మయ్య రాజకీయం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు జంగా రాఘవరెడ్డి.

కాంగ్రెస్ కోల్డ్ వార్ .. పొన్నాల వర్సెస్ జంగా రాఘవరెడ్డి

కాంగ్రెస్ కోల్డ్ వార్ .. పొన్నాల వర్సెస్ జంగా రాఘవరెడ్డి


ఇక ఈ ఆడియో ఒరిజినలా? ఫేక్ నా? అన్న విషయం స్థానిక రాజకీయ వర్గాలలో చర్చనీయాంశం కాగా, అది తన ఆడియో అని జంగా రాఘవరెడ్డి అంగీకరించారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జనగామ టికెట్ కోసం కోల్డ్ వార్ కొనసాగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల టికెట్ కోసం జంగా వర్సెస్ పొన్నాల లక్ష్మయ్య అన్నట్టు కాంగ్రెస్ రాజకీయం సాగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+