ఒక్క రూపాయికే న్యాయ సలహా.. ఎలాగో తెలుసా..?
ఒక్క రూపాయికి ఏం వస్తుంది. అంటే టక్కున సమాధానం చెప్పలేం. కానీ కేవలం ఒక్క రూపాయికి ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న కోర్టు కేసులకు పరిష్కారం దొరుకుంది. న్యాయ పరమైన చిక్కుల్లో ఉన్నవారికి ఇదో సదావకాశంగా భావించవచ్చు. జనగామ జిల్లాకు చెందిన ఓ లా విద్యార్థి.. తన స్నేహితులతో కలిసి ప్రత్యేకమైన వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఇప్పటికే ఈ యాప్ ద్వారా 3 వేల మంది న్యాయ సాయం పొందారు.
కోర్టు కేసులతో సతమతం అవుతున్న పేద ప్రజలకు కేవలం ఒక్క రూపాయికే న్యాయ సలహాలు ఇచ్చి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు తెలంగాణలోని జనగామ జిల్లా చెందిన ఈ యువ లా విద్యార్థులు. కేసులు పరిష్కారం కాక కోర్టుల చుట్టూ తిరుగుతున్న ప్రజలకు జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన ఆదర్శ్ అనే లా గ్రాడ్యూయేట్ అద్భుతమైన పరిష్కారం చూపారు.
ఓ వైపు లా చదువుతూనే.. 9 మంది స్నేహితులతో కలిసి CLNS.in వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ ఏడాది మేలో అదే పేరుతో ప్రత్యేకంగా యాప్ సైతం ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా కేవలం ఒక్క రూపాయికే న్యాయ సేవలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఇప్పటికే 3 వేల మందికి పైగా సాయం అందించారు.

ఆదర్శ్ వివరించిన వివరాల ప్రకారం.. CLNS(Centralised Legal Network Solutions) వెబ్ సైట్ దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులను భాగస్వామ్యం చేసుకుని, టీ-హబ్ నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. ఇప్పటివరకు 3 వేల మందికి పైగా ప్రజలకు సాయం అందించినట్లు ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ యాప్ ద్వారా ఫైండ్ ఎ లాయర్ (Find A Lawyer), అధికారులతో మాట్లాడండి (Talk To official), అవర్ సర్వీసెస్ ఆప్షన్ లతో న్యాయవాదులు, అధికారులను, ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా వెబ్ సైట్ రూపొందించి సేవలు అందిస్తున్నారు.
అంతేకాక ఈ యాప్ లో ప్రస్తుత సాంకేతికత అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను కూడా జోడించి.. కక్షిదారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ వినూత్న ప్రయత్నం న్యాయ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చి ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి, సరైన మార్గదర్శకత్వం లేని వారికి అండగా నిలుస్తుందని ఆదర్శ్ తెలిపారు.












Click it and Unblock the Notifications