వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ కు ఓట్లు వేస్తామన్న వారికే దళితబంధు: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలంగాణ సోయి ఉన్నవాళ్లకి, కెసిఆర్ కు ఓట్లు వేస్తామని చెప్పిన వారికి దళిత బంధు పథకాన్ని అందిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

కెసిఆర్ కు ఓట్లు వేస్తామన్న వారికి మాత్రమే దళిత బంధు ఇస్తామన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

కెసిఆర్ కు ఓట్లు వేస్తామన్న వారికి మాత్రమే దళిత బంధు ఇస్తామన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి


సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల సమావేశం లో పాల్గొన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి రామ్ సాగర్ సర్పంచ్ తాడూరు రవీందర్ తమ గ్రామస్తులకు దళిత బంధు పథకం అందలేదని, అర్హులకు వర్తింప చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పందిస్తూ తెలంగాణ సోయి ఉన్నవాళ్లు గ్రామంలో ఉండే వాళ్ల పేర్లు పంపించాలని సూచించారు. కెసిఆర్ కు ఓట్లు వేస్తామన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని, ఇందులో ఎలాంటి దాపరికం లేదని ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ చేశారు .

సర్పంచ్ పై అందరి ముందే మండిపడిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

సర్పంచ్ పై అందరి ముందే మండిపడిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి


గతంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వ హయాంలో నీళ్లు, విద్యుత్తు ఇస్తున్నామని పేర్కొన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మీ పథకాన్ని, ప్రసూతికి కెసిఆర్ కిట్ ను ఇవ్వడంతోపాటు గా, తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇక కెసిఆర్ కు ఓట్లేస్తేనే దళిత బంధు.. నువ్వు నోరు మూసుకొని కూర్చో అంటూ సర్పంచ్ తో అందరి ముందు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యవహారం స్థానికంగా దుమారంగా మారింది.

ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్న ప్రతిపక్షాలు

ముత్తిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడుతున్న ప్రతిపక్షాలు

కెసిఆర్ కు ఓట్లేసిన వారికే దళిత బంధు పథకం ఇస్తామని ఎమ్మెల్యే చెప్పడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలు తీరు అదే విధంగా ఉందని, సొంత పార్టీ నేతలకే దళిత మందు ఇచ్చుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ కు ఓట్లు వెయ్యకుంటే దళిత బంధు ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో నియంత మాదిరిగా ముత్తిరెడ్డి వ్యవహారం ఉందని కాంగ్రెస్, బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.

 దళిత సర్పంచ్ ను అవమానించిన ముత్తిరెడ్డిపై కేసులు పెట్టాలని కేవీపీఎస్ డిమాండ్

దళిత సర్పంచ్ ను అవమానించిన ముత్తిరెడ్డిపై కేసులు పెట్టాలని కేవీపీఎస్ డిమాండ్

ఇక ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యాఖ్యలతో దళిత సర్పంచ్ కు అవమానం జరిగిందని, ఈ విషయంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది. దళిత సర్పంచ్ ను అవమానించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కూడా కెవిపిఎస్ డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.

 గతంలోనూ ముత్తిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

గతంలోనూ ముత్తిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు


జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గతంలోనూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలో సీనియర్ గా ఉన్నా తనకు మంత్రి పదవి రాలేదని, తన తర్వాత పార్టీ లోకి వచ్చిన ఎంతో మందికి మంత్రి పదవులు వచ్చాయని ఆయన ఓ సమావేశంలో కార్యకర్తల ముందు వాపోయారు. కొత్తగా వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని పేర్కొన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు, నేతలకు సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పించాలని చెప్తూనే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ జిల్లాలో పెత్తనం చెలాయించడం నచ్చకనే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అప్పట్లో వ్యాఖ్యలు చేశారు.

English summary
Janagama MLA Muthireddy Yadagiri Reddy made controversial remarks that only those who vote for KCR will be given the Dalit Bandhu scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X