షాకింగ్ కామెంట్స్: తెలంగాణ రెడ్ల సభలో జేసీకి చేదు అనుభవం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలోనిమేడ్చల్ జిల్లాలో జరిగిన రెడ్ల సభలో అనంతపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డికి ఆదివారం నాడు చేదు అనుభవం ఎదురైంది.

జగన్ దోషి కాదు: పురంధేశ్వరి సంచలనం

చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు, విద్య, ఉద్యోగాల్లో వయోపరిమితి, ప్రత్యేక రిజర్వేషన్‌, గురుకులాల ఏర్పాటు, 50 ఏళ్లు నిండిన రైతులకు 3 వేల పింఛను తదితర డిమాండ్లతో జాతీయ రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి మేడ్చల్‌ మండలం గౌడవెల్లిలో రెడ్డి మహాగర్జన సభ నిర్వహించారు.

రెడ్డి సభలో జేసీ వ్యాఖ్యల కలకలం

రెడ్డి సభలో జేసీ వ్యాఖ్యల కలకలం

ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అణగతొక్కిన వారిలో రెడ్డిలదే మొదటి స్థానమని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు, అసలు భూసంస్కరణల అమలుతో పీవీ నర్సింహా రావు రెడ్లను దెబ్బతీశారని విమర్శించారు. అశలు రాష్ట్ర విభజననే పెద్ద కుట్ర అని, కేవలం రెడ్లను దెబ్బతీసేందుకే రాష్ట్రాన్ని చీల్చారు అన్నట్లుగా మాట్లాడారు.

జేసీకి వ్యతిరేకంగా నినాదాలు

జేసీకి వ్యతిరేకంగా నినాదాలు

అలా మాట్లాడటంతో మిగతా వారు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పక్కనున్నవారు ఆయన చేతిలో ఉన్న మైకును లాక్కున్నారు. జేసీ అలిగిన సభ నుంచి వెళ్లి పోయారు.

జేసీని బతిమాలినా..

జేసీని బతిమాలినా..

ఆయనను నిర్వాహకులు బతిమాలారు. వెళ్లవద్దని కోరారు. కానీ తనకు ఎదురైన పరాభవాన్ని జీర్ణించుకోలేక ఆయన అక్కడి నుంచి తరలి వెళ్లారు.

చంద్రబాబుకు మద్దతుగా..

చంద్రబాబుకు మద్దతుగా..

గతంలో ఏపీలో నిర్వహించిన పలు సభల్లో ఆయన మా రెడ్లంతా మీకే మద్దతిస్తారని, కమ్మల అధికారానికి రెడ్లు సహకరిస్తే తప్పు ఏమిటని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Anantapuram MP JC Diwakar Reddy faces bitter experience in Telangana Reddy Maha Sabha.
Please Wait while comments are loading...