కెసిఆర్, చంద్రబాబు మధ్య క్విడ్ ప్రోకో: జీవన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడికి, కె. చంద్రశేఖర రావుకు మధ్య క్విడ్ ప్రో కో జరిగిందని కాంగ్రెస్ శాసనసభ్యుడు జీవన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తప్పులు ఎత్తిచూపుకోకుండా ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఎలా చేయి కలుపుతారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రభుత్వంపై ప్రజల ఆశలు సన్నగిల్లాయని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌భవన్‌లో ఆయన శనివారంనాడు మీడియాతో మాట్లాడారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారన్నారు.
గతంలో మెదక్ లోక్‌సభ, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బీజేపీకి మద్ధతు ఇచ్చామని చెప్పారు. మిత్ర ధర్మం పాటించాల్సిన అవసరం బిజెపికి ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం లేదన్నారు. మోడీ, చంద్రబాబులపై నమ్మకంతో ప్రజలు తమను గెలిపిస్తారని రావుల వివరించారు.












Click it and Unblock the Notifications