తెలంగాణ వ్యతిరేక పార్టీ: టిడిపిపై జీవన్ ఫైర్

తెలంగాణ నేతలు ఇందుకోసం చంద్రబాబును ఒప్పించాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డుల ఏరివేతను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ కొత్త ఆహార భద్రతా కార్డుల పేరుతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.
ఇప్పటికే బోగస్ కార్డుల పేరుతో పదిలక్షల రేషన్ కార్డులను ఏరివేసిన టిఆర్ఎస్ సర్కారు.. మళ్లీ రేషన్ కార్డులను తొలగించాలన్నది ఇది ఎంతవరకు సమంజసమని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. టిఆర్ఎస్ విధానాలతో పెన్షన్లకు కూడా కోత పడుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నాలుగేళ్లలో ఇంటింటికీ నీళ్లు: కెటిఆర్
వచ్చే నాలుగేళ్లలో ఇంటింటికీ తాగు నీటిని అందిస్తామని మంత్రి కె తారక రామారావు అన్నారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఆర్టీసి పాలక మండలి సమావేశం రసాభాస
బస్ భవన్‌లో ఆర్టీసీ పాలక మండలి సమావేశం రాసాభాసగా మారింది. ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజనపై జవహర్ కన్సల్టెన్సీ నివేదికపై టిఎంయు, తెలంగాణ ఈయూ అభ్యంతరం చెప్పడంతో సమావేశం గందరగోళం నెలకొంది. నివేదిక తప్పుల తడకగా ఉందని టిఎంయు నేతలు ఆరోపించారు. దీంతో అధికారులు సమావేశాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications