వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయీం డైరీ ఎక్కడ, కిలోల కొద్ది బంగారం, వజ్రాలు ఏవి?: జీవన్ రెడ్డి

గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్‌పై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ సాగింది. గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే నయీమ్ ఎదిగాడని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తప్ప

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్‌పై తెలంగాణ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ సాగింది. గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే నయీమ్ ఎదిగాడని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తప్పుబట్టారు. నయీమ్ ఎన్‌కౌంటర్ అనంతరం అతడి స్థావరాల నుంచి వందలు, వేల కోట్ల విలువైన సంపదను పోలీసులు పట్టుకున్నట్టు వార్తలు వచ్చాయని, ఆ సంపద ఎక్కడ అని ప్రశ్నించారు.

నయీమ్ భవనాలు, అతని అనుచరుల నుంచి ఎంతో విలువైన వజ్రాలు, వైఢూర్యాలు, కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయని అన్నారు. అంతేగాక, వేలాది ఎకరాల భూములకు చెందిన డాక్యుమెంట్లు సైతం పట్టుబడ్డట్టు తెలుస్తోందని అన్నారు.

Jeevan Reddy on Nayeem encounter issue

పట్టుబడిన వీటన్నింటినీ టీఆర్ఎస్ ప్రభుత్వం స్వాహా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నయీమ్ నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం సంపద వివరాలను సభ ముందుంచాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నయీం కేసుకు సంబంధించిన విషయాలను సినిమా టీజర్లలా లీకులు చేస్తున్నారని అన్నారు.

నయీమ్ డైరీ రాసేవాడని వార్తలు వచ్చాయని, దాన్ని బయటపెట్టాలని కేసీఆర్ ను అడిగారు. అతని ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు, సీసీ కెమెరాల ఫుటేజ్ లను బహిర్గతం చేయాలని, అప్పుడే అసలు వాస్తవాలు, టిఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలకు నయీమ్‌తో ఉన్న బంధాలు తెలుస్తాయని అన్నారు. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే వాస్తవాలు వెలుగుచూస్తాయని అన్నారు.

రామచంద్రారెడ్డి

నయీం లాంటి అరాచకశక్తులను ప్రభుత్వం అణిచివేయాలని బిజెపి ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అన్నారు. నగరంలో సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్న అరాచకశక్తులను అణచివేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఓ బ్యాంక్ సీఎండీని ఇంటికెళ్లి కాల్చారని చెప్పిన ఆయన.. ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. నక్సలైట్ల చేతిలో మరణించిన 25మందికి ఉద్యోగాలిచ్చారని, మరో 55మందికి ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. నయీం బాధితులను కూడా ఆదుకోవాలని కోరారు.

సండ్ర వెంకటవీరయ్య

12ఏళ్ల క్రితం అధికారం కోల్పోయిన తమ పార్టీపై కొందరు విమర్శలు చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పక్షపాతం లేకుండా విచారణ కేసు విచారణ జరపాలని కోరారు. నయీం బారిన అనేక మంది పడ్డారని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఇందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.

సున్నం రాజయ్య

నయీం అనేక అరాచకాలకు పాల్పడ్డాడని ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు.
ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో నయీంను అంతం చేసినందుకు అభినందనలు తెలియజేశారు. నయీంకు సహకరించిన అందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సోలిపేట

నయీంను టిడిపి సృష్టిస్తే.. పెంచి పోషించింది కాంగ్రెస్ అని ఎమ్మెల్యే సోలిపేట ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని అన్నారు. 2004 ఎన్నికల సమయంలో తనను బెదిరించారని, అప్పుడు టిడిపి, కాంగ్రెస్ తనకు మద్దతుగా నిలవలేదని గుర్తు చేశారు.

English summary
Congress MLA Jeevan Reddy responded on Nayeem encounter issue in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X