కాంగ్రెస్ లో కొనసాగటం పై తేల్చేసిన జీవన్ రెడ్డి..!!

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. తన అనుచరుడు గంగారెడ్డి హత్య ఘటన పైన జీవనరెడ్డి కలత చెందారు. పార్టీలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు. టీపీసీసీ చీఫ్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడినా జీవన్ రెడ్డ సరిగ్గా స్పందించలేదు. ఈ సమయంలో జీవన్ రెడ్డితో మాట్లాడే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగించారు. తాజా పరిస్థితుల పైన స్పందించిన జీవన్ రెడ్డి పార్టీలో పరిస్థితుల పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.

జీవన్ రెడ్డి వ్యాఖ్యలతో
తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌ను జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని జీవ‌న్ రెడ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం సుస్థిరంగా ఉన్న‌ప్ప‌టికీ పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డాన్ని జీవ‌న్ రెడ్డి తప్పు బట్టారు. పార్టీ ఫిరాయింపుల‌పై కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి లేఖ రాసిన‌ట్లు వెల్లడించారు. మాన‌సిక ఆవేద‌న‌లో ఉన్నాను.. తీవ్ర మాన‌సిక బాధ‌తో లేఖ రాస్తున్నా.. లేఖ రాస్తున్నందుకు విచారిస్తున్నాన‌ని పేర్కొన్నారు.

Jeevan Reddy serious comments over situation in own party congress

జీర్ణించుకోలేకపోతున్నాను
రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌కే ప్ర‌త్యేక గుర్తింపు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ‌కుండా నైతిక విలువ పాటించాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోని ప‌రిణామాల‌ను జీర్ణించుకోలేక‌పోతున్నానంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. సంఖ్యా బ‌లంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌లు మంచి మెజార్టీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయినా కూడా పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్నారు అని జీవ‌న్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

కాంగ్రెస్ కే దక్కుతుంది
పార్టీ ఫిరాయింపుల‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టం రూపొందించిన ఘ‌న‌త కాంగ్రెస్ పార్టీకి ఉందని జీవన్ రెడ్డి గుర్తు చేసారు. పార్టీ ఫిరాయింపుల‌కు వ్య‌తిరేకంగా రాజీవ్ గాంధీ పోరాడారన్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో కొన్ని స్వార్థ‌పూరిత శ‌క్తులు పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తుందంటూ వ్యాఖ్యానించారు. జ‌గిత్యాల‌లో త‌న అనుచరురుడు గంగారెడ్డిని ప‌ట్ట‌ప‌గ‌లే హ‌త్య చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. ఎవ‌రి అండ చూసుకొని గంగారెడ్డిని చంపారన నిలదీసారు. పార్టీ ఫిరాయింపుల వ‌ల్ల కార్య‌క‌ర్త‌లు ఇబ్బంది ప‌డుతున్నారు అని జీవ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+