పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చి, ప్రేమోన్మాది చేతిలో....

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదాబాద్: పొట్ట చేత బట్టుకుని హైదరాబాద్ వచ్చిన యువత ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైంది. పండుగకు ఇంటికి వెళ్తామని సిద్ధపడిన ఆమె ప్రియుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంది.

ప్రేమ పేరుతో మూడేండ్లుగా వేధించాడు. యువతి కాదనడంతో ఉన్మాదిగా మారి కత్తితో పొడిచి పరారయ్యాడు. మరో రెండు రోజుల్లో సొంతూరుకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పడుగ జరుపుకొందామనుకున్న ఆ యువతి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

 పెళ్లి చేద్దామనుకున్నారు..

పెళ్లి చేద్దామనుకున్నారు..

ఏడాది తర్వాత వస్తున్న కూతురు కోసం వేయి కళ్తతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు గర్భశకోమే మిగిలింది. పండుగ తర్వాత కూతురికి పెళ్లి చేద్దామనుకున్న అనుకున్నారు. ఆమెను ప్రేమోన్మాది హైదరాబాదులోని కూకట్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో హత్య చేసిన విషయం తెలిసిందే.

 పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్ి...

పొట్ట చేత పట్టుకుని ఇక్కడికి వచ్ి...

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గుయ్యానవలస గ్రామానికి చెందిన బోను సూర్యనారాయణ, జయమ్మ దంపతుల చిన్న కూతురు బోను జానకి(21) ఉపాధి కోసం ఆరేండ్ల కిందట నగరానికి వచ్చింది. ప్రస్తుతం కూకట్‌పల్లిలోని డిమార్ట్ మాల్‌లో సేల్స్‌గర్ల్‌గా పని చేస్తూ మూసాపేట సర్కిల్ పరిధి హబీబ్‌నగర్‌లో తన స్నేహితురాలు రూపతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నది.

ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి

ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి

మంగళవారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో రూప విధులు ముగించుకొని తన గదికి వచ్చి చూడగా జానకి కత్తిపోట్లతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. వెంటనే స్థానికులు జానకిని కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందింది.

 ప్రేమ పేరుతో వేధిస్తూ..

ప్రేమ పేరుతో వేధిస్తూ..

వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మారెపల్లికి చెందిన అనంతయ్య అలియాస్ ఆనంద్ (27) కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో జానకిని వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడు జానకి పనిచేస్తున్న డీమార్ట్ షాపింగ్‌మాల్‌లో ఫ్లోర్ ఇంచార్జిగా పని చేస్తున్నాడు. ప్రేమించకపోతే చంపేస్తానని చాలా సార్లు బెదిరించాడు. డిసెంబర్ 24వ తేదీన షాపింగ్ మాల్‌లో కొట్టడంతోపాటు గొంతు నులిమాడు. జానకి ఈ విషయాన్ని ఆనంద్ అక్క, బావకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఆనంద్‌ను గట్టిగా మందలించారు. ఆనంద్ జానకిపై మరింత పగ పెంచుకున్నారు

 సంక్రాంతికి ఇంటికి వెళ్దామని...

సంక్రాంతికి ఇంటికి వెళ్దామని...

జానకి సంక్రాంతికి ఇంటికి వెళ్లేందుకు సిద్దమైంది.పదో తేదీ తర్వాత పది రోజుల వేతనాన్ని ఇస్తామని షాపింగ్‌మాల్ నిర్వాహకులు చెప్పడంతో శుక్రవారం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది. పండుగకు ఇంటికి వెళ్తే తిరిగి రాదనే అనుమానంతో ఆనంద్ మంగళవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న జానకిపై దాడి చేశాడు. ముందు గొంతు నులిమి ఆ తర్వాత కత్తితో ఛాతి, కడుపు భాగంలో మూడు సార్లు పొడిచి పారిపోయాడు.

 ఆమె ఆరో సంతానం...

ఆమె ఆరో సంతానం...

సూర్యనారాయణ, జయమ్మ దంపతులకు జానకి ఆరో సంతానమని, ఐదుగురికి పెళ్లిళ్లు చేశారని త్వరలో చిన్నబిడ్డకు పెండ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే ఈ ఘోరం జరిగిపోయిందని జానకి బంధువులు అంటున్నారు. కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులకు జానకి ఉద్యోగం చేస్తూ ఆసరాగా నిలిచిందని, దాదాపు ఏడాది తర్వాత తల్లిదండ్రులను కలుస్తున్నానని సంతోషపడిందని, ఊరికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నదని జానకి స్నేహితులు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A jilted lover allegedly stabbed his 24-year-old female colleague to death at her house at Moosapet on Tuesday night.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి