దున్నపోతును తన్నినట్లు..! ‘బీజేపీ లీడర్‌షిప్’పై జితేందర్ రెడ్డి వీడియో ట్వీట్ కలకలం
హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత, మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో సరికొత్త అలజడికి తెరలేపిందని చెప్పవచ్చు. ఆయన ట్వీట్ ఇప్పుడు ఇతర పార్టీలకు అస్త్రంగా మారుతోంది.
తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరముందంటూ జితేందర్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. దున్నపోతుల్ని తన్నుకుంటూ ట్రాలీలో ఓ వ్యక్తి ఎక్కించిన వీడియోను ట్వీట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటిదే తెలంగాణ బీజేపీ నాయకత్వానికి అవసరమంటూ వ్యాఖ్యానించారు. ఆయన కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు.

అయితే, మళ్లీ అదే పోస్టును ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక, బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సాల్‌ను ట్యాగ్ చేయడం గమనార్హం. దీంతో సొంతపార్టీ నేతలతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కొందరు ఆ ట్వీట్‌కు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బీజేపీలో లుకలుకలు బయటపడుతున్నాయంటూ వారు పేర్కొంటున్నారు.
తెలంగాణ బీజేపీ నేతల్లో ఉన్న అసంతృప్తిని ఇలా బయటపెట్టుకుంటున్నారా? అని అనుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ నాయకత్వంపై జితేందర్ రెడ్డికి ఇంత అసంతృప్తి ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీ నేతలు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జితేందర్ రెడ్డి.. ఇలాంటి ట్వీట్లు చేశారా? అని సందేహిస్తున్నారు.
This treatment is what's required for Bjp Telangana leadership.@blsanthosh @BJP4India @AmitShah @sunilbansalbjp @BJP4Telangana pic.twitter.com/MMeUx7fb4Q
— AP Jithender Reddy (@apjithender) June 29, 2023
తెలంగాణ బీజేపీలో కీలక నేతగా ఉన్న జితేందర్ రెడ్డి ఇలాంటి ట్వీట్లు చేయడం రాజకీయంగా మరింత వేడిని పెంచింది. తెలంగాణ బీజేపీలో ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే, ఆ తర్వాత జితేందర్ రెడ్డి తన ట్వీట్‌ను సమర్థించుకుంటూ మరో ట్వీట్ చేశారు.
కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే...
— AP Jithender Reddy (@apjithender) June 29, 2023
బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి
అయితే, ఇది తెలంగాణ బీజేపీ నాయకత్వానికి మద్దతు పలుకుతూ ఉండటం గమనార్హం. 'బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి' అంటూ జితేందర్ రెడ్డి తన ట్వీట్‌పై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..!












Click it and Unblock the Notifications